జ‌గ‌న్ అస్త్రంతో బాబు డైల‌మా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 10:54:55

జ‌గ‌న్ అస్త్రంతో బాబు డైల‌మా

లాజిక్ లేకుండా రాజ‌కీయాల గురించి మాట్లాడితే నోరు జారి జనాల మ‌ధ్య ఏమీ తెలియ‌ని రాజ‌కీయ స‌బ్జెక్ట్ లేని నాయ‌కుడు. అనే బిరుదు తెచ్చుకున్న నాయ‌కులు, తెచ్చుకుంటున్న నాయ‌కులు అనేక మంది ఉన్నారు రాజ‌కీయాల్లో.. ఇక తాజాగా ఏపీలో రాజ‌కీయంగా ర‌స‌వ‌త్త‌ర కురుక్షేత్రం జ‌రుగుతోంది.. ఏపీ సీఎంచంద్ర‌బాబు ముందు ఉండి ప‌వ‌న్ తో రాజ‌కీయ క్రీడ నెర‌పుతున్నారు అనే విమ‌ర్శ‌లు ప‌వ‌న్ పై వినిపిస్తున్నాయి... అయితే మీడియా ముఖంగా ప‌వ‌న్ వ‌చ్చి మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానానికే ఛాన్స్ ఇవ్వ‌కుండా ఓ స్పీచ్ ఇచ్చి, వైసీపీ అధినేత స‌వాల్ కు కౌంట‌ర్ కు రీ కౌంట‌ర్ ఇచ్చారు.
 
ఇంత వ‌రకూ బాగానే ఉంది.. బాబు పార్ట‌నర్ అనే మాట ప‌వ‌న్ కు నచ్చ‌లేదు.. ఆ సమావేశంలో ప‌వ‌న్ మాట బ‌ట్టీ అర్ధం అయిపోతుంది.. క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, కశ్మీర్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ యాత్ర చేసి ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం పెట్టే అవిశ్వాస తీర్మానానికి ప‌లు పార్టీల మ‌ద్ద‌తు అడుగుతా, ఓ అడుగు ముందుకు వేసి ఇటీవ‌ల జ‌త‌క‌డుతున్న కారుపార్టీతో కూడా, తెలంగాణ‌లో మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తా అన్నారు ప‌వ‌న్.. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది.. స‌గ‌టు ఓట‌రుకు జ‌నానికి అర్ధం అయింది.. ప‌వ‌న్ చెప్పింది వాస్త‌వం అని అంద‌రూ గ్ర‌హించారు.
 
అయితే నీ ముక్కు ఏది అంటే చుట్టూ తిప్పి చూపిన‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ అస‌లు తెలుగుదేశం ఎంపీల చేత మాట్లాడ‌తా అనే మాట అన‌లేదు.. ముందు మీ పార్ట‌న‌ర్ పార్టీ నాయ‌కుల చేత మ‌ద్ద‌తు ఇప్పించాలి  క‌దా అప్పుడు మిగిలిన రాష్ట్రాలు మ‌ద్ద‌తు ఇస్తాయి అనే సోయ మ‌ర్చిపోయారు ప‌వ‌న్ అంటున్నారు విశ్లేష‌కులు..
 
అయితే ఇక్క‌డ అవిశ్వాస తీర్మానం పై ఇరు పార్టీలు మ‌ద్ద‌తు కావాలి రాష్ట్రంలో జ‌గ‌న్ రెడీ మ‌రి బాబు అంటే అది స‌మాధానం లేని ప్ర‌శ్న‌.. పోని ఇటు కాంగ్రెస్ మ‌ద్ద‌తు అంటోంది దానిని క‌లుపుకుపోవ‌చ్చు...  ఇక మిగిలిన‌ పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వ‌కపోతే, బీజేపీ పై వారికి ప్రేమ ఉన్న‌ట్లే అనేది తేలుతుంది.... ఇక బాబు వేసిన బంతి చివ‌ర‌కు ప‌వ‌న్ చేత బాబు కోర్టులోకే ప‌డింది.. సో ఇప్పుడు జ‌గ‌న్ కు ఉన్నా ఐదుగురు ఎంపీల‌లో ఒక‌రి చేత అవిశ్వాస తీర్మానం పెడితే,  మిగిలిన రాయ‌బార రాజ‌కీయం అంతా ప‌వ‌న్ చెయాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.