జ‌గ‌న్ స‌రికొత్త నినాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 12:05:29

జ‌గ‌న్ స‌రికొత్త నినాదం

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి నినాదాలు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప్ర‌తిపార్టీ ఓ పొలిటిక‌ల్ ఎజెండా తో పాటు ఒక నినాదంతో బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాయి. నినాదాల‌కు చాలా ప‌వ‌ర్ ఉంటుంది.. దేశంలో ఇప్ప‌టికే ఎన్నో నినాదాలు వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం పార్టీ నినాదాల‌తోనే అధికారంలోకి వ‌చ్చింద‌నేది నిజం. బ్రింగ్ బ్యాక్ బాబు, జాబు రావాలంటే...బాబు రావాలి లాంటి నినాదాలను టీడీపీ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. టీడీపీ స‌భ‌లు ఎక్క‌డ జ‌రిగినా జాబు రావాలంటే...బాబు రావాలి అనే నినాదం వినిపించేది...
 
అలాగే సోష‌ల్ మీడియాలో బ్రింగ్ బ్యాక్ బాబు పేరుతో టీడీపీ క్యాంపెయిన్ నిర్వ‌హించింది. ఈ  రెండు నినాదాలు ప్ర‌జ‌ల్లోకి జోరుగా తీసుకెళ్లారు టీడీపీ నేత‌లు. టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఇవి చాలానే ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఈ నినాదాలతో పాటు త‌ప్పుడు హామీల‌తో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌నేది ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిన విష‌యం. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు చంద్రబాబు...
 
రాజన్న రాజ్యాన్ని స్థాపించడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్నారు..జగన్ చేపట్టిన ఈ ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు..దానితోపాటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది...ఒక్కసారి జగన్ కి అవకాశం ఇవ్వండి..రాజన్న పాలనను అందిస్తారు...ఆలా చేయకపోతే మిరే ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తుంది...
 
ఈ నినాదాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలా వైసీపీ ప్లాన్ లు రూపొందిస్తోంది. దానికి త‌గ్గ‌ట్లుగానే వైసీపీ నేత‌లు మీడియాలో స‌మావేశాల్లో కూడా గ‌త కొద్ది రోజులుగా జగన్ నిజాయితీపరుడు, ఇచ్చిన మాట కోసం ఎంత వరకైనా వెళ్లే వ్యక్తి, జగన్ నీతివంతమైన రాజకీయాలే చేస్తారు...అందుకే ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి అంటూ ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు... 
 
వైసీపీకి సోషల్ మీడియాలో మంచి పట్టు ఉంది...టీడీపీ అవినీతిని, చేస్తున్న మోసాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు...ఏదైనా విషయం తెలుసుకోవాలంటే మీడియాను కాకుండా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు యువత..అందుకే సోషల్ మీడియాలో కూడా ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండి అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైసీపీ సోషల్ మీడియా సైనికులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.