జ‌గ‌న్ మ‌రో కొత్త అస్త్రం బాబు వెన్నులో వ‌ణుకు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-05 17:17:28

జ‌గ‌న్ మ‌రో కొత్త అస్త్రం బాబు వెన్నులో వ‌ణుకు

ఏపీ పొలిటిక‌ల్  స్క్రీన్ మీద రాజ‌కీయాన్ని మ‌రింత‌గా వేడెక్కించ‌డానికి ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని చంద్ర‌బాబును టార్గెట్ చేస్తున్నార‌ట జ‌గ‌న్. గతంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
హోదా కోసం తమ ప‌ద‌వుల‌ను త్యాగాలు చేస్తే టీడీపీ నాయ‌కులు స‌భ‌ల పేరు చెప్పి డ్రామాలు ఆడుతున్నార‌ని వారు మండిప‌డ్డారు. కానీ అనూహ్యంగా మోడీ స‌ర్కార్ మీద అవిశ్వాస‌ తీర్మానం రావ‌డంతో టీడీపీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. దీంతో వైసీపీ ఎంపీలు మాజీల హోదాలో ఉండ‌టంతో టీడీపీ అవిశ్వాస తీర్మాన స‌మ‌యంలో పార్ల‌మెంట్ బ‌య‌టే ఉండిపోయారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏమైనా చెయ్యాల‌నే ఉద్దేశంతో వైసీపీ మ‌రో అస్త్రాన్ని వ‌దిలిన‌ట్లు తెలుస్తోంది.
 
ఆ అస్త్రం ఏంటోకాదు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన విధంగానే ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇరుకున ప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం డిల్లీని గ‌ట్టిగా ప్రశ్నించ‌డం మానేసి కేవ‌లం నిర‌స‌న స‌భ‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాలం గ‌డుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు వాపోతున్నాయి. 
 
ఇక ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాలంటే ఎమ్మెల్యేలంతా మూకుమ్మ‌డిగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుంద‌న్న కోణాన్ని జ‌గ‌న్ చాలా సీరియ‌స్ గా ప‌రిశీలిస్తున్నార‌ట‌. డిల్లీమీద పోరాటం చెయ్య‌ని బాబు వైఖ‌రిని నిర‌సిస్తూ ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రాన్ని సందిస్తే త‌ప్ప‌కుండా ప్ర‌త్యేక హోదా ఫ‌లితం ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఇదే అశంపై పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించ‌నున్నార‌ట‌. 
 
వాస్త‌వానికి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్నారు. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో మ‌రింత ఉత్స‌హం నింపుతున్నారు. ఈ పాద‌యాత్ర‌లో చంద్ర‌బాబును టార్గెట్ చెయ్య‌డం ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కోసం కార్య‌క్రాలు ఏర్పాటు చెయ్య‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఇక జ‌గ‌న్ సందించే ఈ అస్త్రానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇరుకున ప‌డిన‌ట్లు అయింది. గతంలో వైసీపీ ఎంపీల‌ను ఎదుర్కునేందుకు తూ, తూ మంత్రంగా త‌మ ఎంపీల‌తో కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టించార‌ని  ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు అస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.