జగన్ స్కెచ్ మాములుగా లేదు.. టీడీపీ చచ్చినా కోలుకోలేదు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-11-06 13:27:46

జగన్ స్కెచ్ మాములుగా లేదు.. టీడీపీ చచ్చినా కోలుకోలేదు..

ప్రస్తుతం ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీ కి జంప్ అవడం సర్వ సాధారణ విషయం అయిపొయింది.. నమ్మిన ప్రజలను, విశ్వాసం ఉంచి పార్టీ నాయకులను మోసం చేసి ఇలా వెళ్లడం నమ్మకద్రోహమే అయినా అధికార దాహం, డబ్బు మొహం ఉన్న నాయకులూ అలానే చేస్తున్నారు.. 2014 లో వైసిపి తరపున గెలిచి టీడీపీ లోకి జంప్ అయినా ఒక ప్రబుద్ధ నాయకుడు కి ఈ ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసాడు.. టీడీపీ కోలుకోలేని విధంగా జగన్ వేసిన స్కెచ్ కి వారి దిమ్మ తిరిగి పోతుంది.. మరి జగన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 
 
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు. ఉరఫ్ నెహ్రూ.. ఈయన పేరు వినే ఉంటారు..  తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు. దివంగత వైఎస్ అనుచరుడుగా ఉన్న జ్యోతుల.. తర్వాత వైసీపీలో చేరి జగన్‌కు అన్నగా వ్యవహరించారు. అయితే, తన కుమారుడి భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. ఈపరిణామాన్ని ఊహించని జగన్‌.. తీవ్రంగా కలత చెందారు. అసెంబ్లీలో తన తర్వాత జ్యోతుల కే జగన్ పెద్ద పీట వేశారు. అయినా ఆయన పార్టీని వీడిపోవడం తీవ్రంగా కలిచి వేసింది.
 
ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో నూ వచ్చే ఎన్నికల్లో జ్యోతులకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తూర్పులో పాదయాత్ర నిర్వహించినప్పు డు కూడా యాత్ర షెడ్యూల్‌లో లేని జగ్గంపేటను అప్పటికప్పుడు చేర్చుకుని జగన్ పాదయాత్ర ఆ నియోజకవర్గం మీ