ఆనంకు వైసీపీ ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 17:11:22

ఆనంకు వైసీపీ ఆఫ‌ర్

ఆనాడు వైయ‌స్ త‌మ‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు,  త‌ర్వాత ఉన్న నాయ‌కులు కాంగ్రెస్ లో ఎంతో మంచి గౌర‌వం ఇచ్చారు... జిల్లాలో ఆనం బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్ పార్టీలో చ‌క్రం తిప్పారు అని అంటారు ఇప్ప‌టికీ.. అయితే ఇప్పుడు ఆనం సోద‌రుల ప‌రిస్దితి తెలుగుదేశంలో ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త‌క‌న్నా దారుణంగా మారిపోయింది... నెల్లూరు జిల్లాలో ఆనం సోద‌రుల‌కు అస‌లు తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప్ర‌యారీటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో వారు కొంత కాలంగా బాబు పై జిల్లా నాయ‌క‌త్వం పై గుర్రుగా ఉన్నారు..
 
పార్టీలో చేరిన స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఇస్తాము అన్నారు ఆ కోరిక నెవ‌ర్చ‌లేదు.. టీటీడీ ప‌ద‌వి అలాగే నామినెటెడ్ ప‌ద‌వి వ‌స్తుంది అని చూశారు అది నెర‌వేర‌లేదు... చివ‌ర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటు అయినా వ‌స్తుంది అని అనుకుంటున్న స‌మ‌యంలో అస‌లు జిల్లా కార్య‌క్ర‌మాల‌కు కూడా వీరికి ఆహ్వానాలు అంద‌డం లేదు, దీంతో ఆనం సోద‌రులు త‌మ‌కు స‌రైన గౌర‌వం ఇవ్వని పార్టీలో ఉండ‌టం ఎందుకు అని నిర్ణ‌యానికి వ‌చ్చారు అని తెలుస్తోంది..
 
తాజా నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు చూస్తుంటే స‌మీక‌ర‌ణాలు మారాయి అని తెలుస్తోంది.. మాజీ మంత్రిగా చేసిన ఆనం రాం నారాయ‌ణ రెడ్డికి కూడా పార్టీలో స‌రైన స‌ముచిత గౌర‌వం లేదు... ఇక టీడీపీలో ఉండి మ‌రింత విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం అవ‌మానాలు భ‌రించ‌డం ఎందుకు అనే నిర్ణ‌యానికి ఆనం సోద‌రులు వ‌చ్చారు అని తెలుస్తోంది.
 
త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు ఆనం సోద‌రులు అని తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు కార్యాలయంలో చంద్రబాబు ఫొటోలను సైతం తొలగించారు. అయితే రాం నారాయణరెడ్డిని బుజ్జగించేందుకు తెలుగుదేశం పెద్దలు ప్రయత్నించినప్పటికీ… ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
 
ఇక జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో ఆనం చర్చలు జరిపినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆత్మకూరు సీటు ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది… అయితే వెంకటగిరి అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆనం పట్టుబడుతున్నారు అనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రికి రాగా… ఉద్దేశపూర్వకంగానే ఆనం రాంనారాయణరెడ్డి 
అక్కడి నుంచి వెళ్లిపోయారు..
 
దీనిపై తెలుగుదేశం నాయ‌కులు కూడా కంగుతిన్నారు.. ఆనం ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్ప‌డ‌మే బెట‌ర్ అనే ఆలోచ‌న‌కు వ‌చ్చింది అని తెలుస్తోంది... మ‌రోప‌క్క తెలుగుదేశంలో ఉంటే ఈ సీటు కూడా వ‌చ్చేది లేదు, మ‌నం వైసీపీలో చేరుదాం క‌ష్ట‌ప‌డ‌దాం అని ఆనం కేడ‌ర్ కూడా ఆయ‌న‌కు సూచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో వారంలో ఇక్క‌డ నెల్లూరు టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌ప్ప‌దు అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.