జ‌గ‌న్ హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 18:43:48

జ‌గ‌న్ హామీ

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు పాణ్యం గురించి చ‌ర్చ జ‌రుగుతోంది.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపార్టీ త‌ర‌పున ఎవ‌రు నిల‌బ‌డ‌తారు అనేది పెద్ద చ‌ర్చ‌గా మారింది. వైసీపీ సీట్టింగ్ స్ధానం కావ‌డంతో చ‌ర్చ తెలుగుదేశం కూడా చేస్తోంది..వైసీపీలో టికెట్ కోసం ఇప్ప‌టి నుంచే మంత‌నాలు జ‌రుగుతున్నాయి అనేది ఇంట‌ర్న‌ల్ గా న‌లుగుతున్న అంశం.
 
దీనికి ప్ర‌ధాన కారణం బీజేపీలో ఉన్న‌టువంటి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, ఇటీవ‌ల  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి అనే చెప్పాలి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎమ్మెల్యే కాబ‌ట్టి ఆయ‌నకు జ‌గ‌న్ సీటు ఇస్తారు అని అంద‌రూ భావించారు. అయితే ఇప్పుడు  కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి చేర‌డంతో సీటు పై ఆలోచ‌న‌లు ఇరువురిపై మ‌ళ్లాయి.
 
ఇటీవల గౌరు వెంకటరెడ్డి దంపతులు పాణ్యం నియోజకవర్గ మండలాలలో బూత్‌ లెవల్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ట్రైనింగ్‌ క్లాసులు ముగిసిన తర్వాత గౌరు దంపతులతో మండలస్థాయి నాయకులు పోటీ విషయంపై కాసేపు ముచ్చటించారు. పోటీ విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుంచి తానే పోటీ చేస్తానని గౌరు చరితా వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
 
అయితే ఇక్క‌డ తెలుగుదేశం మాత్రం మ‌రో ప్ర‌చారాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింది. కాట‌సానికి జ‌గ‌న్ సీటు ఇచ్చార‌ని ఇటు గౌరు ఫ్యామిలీ అందుకే ముందు నుంచి సెగ్మెంట్లో త‌మ‌కే సీటు అని ప్ర‌చారం చేసుకుంటున్నారు అని కొత్త ప్ర‌చారం మొద‌లుపెట్టింది.. ఇక మ‌రో ప‌క్క కాట‌సాని వైసీపీ త‌ర‌పున నిల‌బ‌డితే టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది అని ఇక్క‌డ మ‌రో కొత్త ప్ర‌చారం మొద‌లు అయింది. సిట్టింగ్ కు జ‌గ‌న్ సీటు ఇస్తే మ‌రోసారి ఇక్క‌డ విజ‌యం క‌ష్టం అని వారికి వారే కొత్త స‌ర్వే అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టారు.
 
అయితే జ‌గ‌న్ మాత్రం కాట‌సానికి పార్టీలో తీసుకున్న స‌మ‌యంలో టికెట్ విషయంలో ఎటువంటి హామీ ఇవ్వ‌లేదు అని అంటున్నారు సీనియ‌ర్లు.. ఇటీవ‌ల ఆయ‌న కూడా జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటే అలా తాను న‌డుచుకుంటా అని,పోటీ పై ఆయ‌న ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.ఆయ‌న ఎంపీ సీటు ఇచ్చినాఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అంటున్నారు సీనియ‌ర్లు. మ‌రోవైపు పార్టీ త‌ర‌పున ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఉంటారు అని కొంద‌రి వాద‌న.
 
అయితే ఆయ‌న పాణ్యం సీటు అడిగిన మాట వాస్త‌వం, కాని సిటింగ్ ఎమ్మెల్యేకు మ‌ళ్లీ అవ‌కాశం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని జ‌గ‌న్ కాట‌సానికి  తెలియ‌చేశార‌ట‌. అయితే ఇరువురు కేడ‌ర్ తో క‌లిసి  ముందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చార‌ట. అలాగే తెలుగుదేశం త‌ర‌పున అభ్య‌ర్ది ఎవ‌రు అనేది తేలిన త‌ర్వాత ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్ది పై ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకుంటారు అని తెలుస్తోంది. మ‌రి బైరెడ్డి తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇస్తే ఇక్క‌డ ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది. మ‌రి చూడాలి ఇక్క‌డ పాణ్యం రాజ‌కీయం ఇరు పార్టీల్లో ఎటువంటి ట‌ర్నింగ్ లు తిరుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.