చిరున‌వ్వు చిందించిన‌ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-03 02:24:28

చిరున‌వ్వు చిందించిన‌ జ‌గ‌న్

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర ఈ రోజుటితో 253వ రోజుకు చేరుకుంది. ఇడుపుల‌పాయ‌లో ప‌డిన మొద‌టి అడుగు రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరుజిల్లాను జ‌గ‌న్ తన పాద‌యాత్ర ద్వారా పూర్తి చేసుకున్నారు.
 
ఈ రోజు మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం ముల్లాప‌ల్లిలో ప్రారంభం అయిన పాద‌యాత్ర అక్క‌డి నుంచి కొత్త‌పెంట‌,ఎ భీమ‌వ‌రం, ప‌డుగు పాలెం, ఎ కోడూరు మీదుగా కొన‌సాగనుంది. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కొత్త‌పెంట‌కు చేరుకోగాను ఆ ఊరి గ్రామ‌స్తుల‌తో  క‌లిసి కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొన్నారు. గ్రామంలో చిన్నారి కృష్ణుడి వేషంలో ఉన్న వానిరి జ‌గ‌న్  ప్రేమతో ప‌లుక‌రించారు. 
 
అంతేకాదు చిన్నారి ఉట్టికొడుతుంటే చిరున‌వ్వులు చిందించారు జ‌గ‌న్. ఆ త‌ర్వాత త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ రోజు పార్టీ నాయ‌కులు కే కోట‌పాడులో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు జ‌గ‌న్‌.

షేర్ :