కృష్ణాలో కాలు పెట్టిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 13:43:46

కృష్ణాలో కాలు పెట్టిన జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుంటూరు జిల్లా నుంచి త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకుని కృష్ణా జిల్లాలోకి ఎంట‌ర్ అయ్యారు.. దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి అశేష జ‌న‌వాహినితో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది.కనకదుర్గ వారధి వద్ద వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు.
 
జ‌గ‌న్ ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు కార్య‌క‌ర్త‌ల‌తో విజ‌య‌వాడ జ‌న‌సంద్రంగా మారింది.. దుర్గ‌మ్మ వార‌ది జ‌గ‌న్ నినాదంతో మార్మోగిపోతోంది.కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు.. అలాగే . జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు.
 
రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన జిల్లా కృష్ణాలో... జ‌గ‌న్ పాదయాత్ర  కనకదుర్గ వారధి గుండా ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్‌, శిఖామణి సెంటర్‌, పుష్పా హోటల్‌ సెంటర్‌, సీతారాంపురం సెంటర్‌ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. అక్కడినుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్‌కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 
చిట్టినగర్‌ సెంటర్‌లో జరిగే బహిరంగం సభలో జననేత ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ వద్ద యాత్ర ముగిస్తారు. నేడుజ‌గ‌న్ స‌మ‌క్షంలో మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి పార్టీలో చేర‌నున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.