ఈ అవ్వ జ‌గ‌న్ కు చెప్పిన మాట‌లు వింటే ఫిదా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:47:42

ఈ అవ్వ జ‌గ‌న్ కు చెప్పిన మాట‌లు వింటే ఫిదా

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప‌డుచుప్రాయం నుంచి ముస‌లి ప్రాయం వ‌ర‌కూ తండోప తండాలుగా క‌దిలి వ‌చ్చి జ‌న‌నేత‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు... అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ, అలాగే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌తో వింటూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్... ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర టీడీపీ నాయ‌కుల కంచుకోట అయిన గుంటూరు జిల్లా  శ్రీరామ్‌ నగర్ లో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
అయితే జ‌గ‌న్ త‌న యాత్ర‌తో శ్రీరామ్ న‌గ‌ర్ లోకి చేరుకోగానే త‌న మ‌న‌వ‌డు వ‌చ్చాడంటు ఓ వృద్దురాలు న‌డ‌వ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉన్నా కూడా క‌ష్ట‌ప‌డి జ‌గ‌న్ ను చూసేందుకు వ‌చ్చింది.... ఆ వృద్దురాలు జ‌గ‌న్ వ‌ద్ద‌కు రాగానే  ఆప్యాయంగా బాగున్నావా నాయ‌న‌మ్మ అంటూ ప‌లుక‌రించారు... జ‌గ‌న్ అలా పిలువ‌గానే తాను తెచ్చుకున్న ఫిర్యాదు ప‌త్రాన్ని చించిపాడేసింది... ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఏ ఒక్క రాజ‌కీయ‌నాయ‌కుడు న‌న్ను ఇంత ఆప్యాయంగా ప‌లుక‌రిచ‌లేదంటూ ఆ వృద్దురాలు ఫిదా అయింది.
 
ఇంత‌కు ఆ వృద్దురాలు విన‌తి ప‌త్రంలో ఏమ‌ని పేర్కొందంటే... అయ్యా.. నా వయస్సు 70 ఏళ్లు ఇప్పటికీ పింఛన్‌ రావట్లేదు అంటూ జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేసేందుకు వ‌చ్చింది.. తనకు ఆరుగురు ఆడపిల్లలని.. అందరూ పెళ్లిళ్లు చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్లిపోయారని, వృద్ధాప్యంలో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పింఛన్‌ కోసం ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం లేదని ఈ విన‌తి ప‌త్రంలో పేర్కొంది... కానీ జ‌గ‌న్ ప్రేమ‌తో ఆప్యాయంగా ఆ వృద్దురాలిని ప‌లుక‌రించ‌డంతో తన మ‌న‌సులోని మాటను మార్చుకుంది.
 
ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ తో ఆ వృద్దురాలు ఇలా మాట్లాడుతూ.. త‌న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పింఛన్ ఇవ్వ‌కున్నా ప‌ర్వాలేదు కానీ నీవు ముఖ్య‌మంత్రి అయితే చాలు నాయ‌నా అంటూ జ‌గ‌న్ ను ఆశీర్వ‌దించింది... నువ్వు అధికారంలోకి వ‌స్తే మాలాంటి వృద్దుల‌కు పింఛ‌న్ ల‌కు ఎటాంటి డోకా ఉండ‌దు నాయ‌న అంటూ చెప్పుకొచ్చింది.... అలాగే తాను ఇక నుంచి పింఛ‌న్ కోసం ప్ర‌భుత్వ ఆఫిసులో అర్జీ ఇవ్వ‌న‌ని చెప్పింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.