జగన్ కు తప్పిన ప్రమాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 06:25:49

జగన్ కు తప్పిన ప్రమాదం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.  ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప పాద‌యాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా శ్రీకాళ‌హ‌స్తిలో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. 

అయితే ఈ స‌భ కోసం ఏర్పాటు చేసిన వేదిక కూలిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌మాదంలో దాదాపు ప‌ది మంది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌ముందే ఈ ఘ‌ట‌న  జ‌ర‌డంతో ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు. వేదిక‌పై ఎక్కువ మంది ఉంట‌డం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం జరిగింద‌ని తెలుస్తోంది. 

జ‌గ‌న్ తో పాటు కేవ‌లం కొంత‌మంది ముఖ్య నేత‌లు  మాత్ర‌మే ఆ వేదిక‌పైకి వ‌చ్చేలా ఏర్పాటు చేశారు. అయితే పాద‌యాత్ర కోసం పెద్ద స్ధానిక నాయ‌కులు త‌ర‌లిరావ‌డం ప‌రిమితికి మించి అక్క‌డ‌కు ముందుగానే చేరుకుని వేదిక‌పైకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం. 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.