పాద‌యాత్ర రూట్ మ్యాప్ మార్చి కీల‌క ప్ర‌క‌ట‌న ప్ర‌క‌టించ‌నున్న‌జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 15:43:43

పాద‌యాత్ర రూట్ మ్యాప్ మార్చి కీల‌క ప్ర‌క‌ట‌న ప్ర‌క‌టించ‌నున్న‌జ‌గ‌న్

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలో ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.ఇడుపుల‌పాయ‌నుంచి మొద‌లైన ఈ పాద‌యాత్ర నేటివ‌ర‌కు ఎటు వంటి మార్పులు చేర్పులు జ‌రుగ‌కుండా దిగ్విజ‌యంగా సాగింది.. అయితే రూట్ మ్యాప్ ప్ర‌కారం పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గం త‌ర్వాత జ‌గ‌న్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టాలి. 
 
కాని కొన్ని అనివార్య కార‌ణాల వల్ల రూట్ మ్యాప్ మారింది. ఈ యాత్ర పిఠాపురం వైపు కాకుండా జ‌గ్గం పేట వైపు మ‌ళ్లింది. దీంతో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ఎందుకు మార్చారో వైసీపీ నాయ‌కులు కాస్త ఆలోచన‌లో ప‌డ్డార‌ట‌. 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ్గం పేట నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసిన నెహ్రూ విజ‌యం సాధించారు ఆ త‌ర్వాత ఆయ‌న అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. టీడీపీలోకి జంప్ జ‌లాని చేసిన నెహ్రూకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ త‌న రూట్ మ్యాప్ న్ మార్చారా అన్న‌విష‌యం కూడా పార్టీలో సాగుతోంది. 
 
జ‌గ‌న్ పెద్దాపురం త‌ర్వాత పిఠాపురం వెళ్ల‌కుండా జ‌గ్గంపేట‌లో పాద‌యాత్ర నిర్ణ‌యం వెనుక ఓ సెంటిమెంట్ ఉంద‌నేది తెలుస్తోంది. ఈ నెల 29వ తేదిన జ‌గ్గంపేట‌లో 175 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇంచార్జ్ ల‌తో, అలాగే 25 మంది పార్ల‌మెంట్ స్థానాల్లో పోటీ చెయ‌బోయే ఇంచార్జ్ ల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు జ‌గ‌న్. ఈ కీల‌క భేటీలో వైసీపీ వ్యూహం పై జ‌గ‌న్ క్లారిటీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. 
 
అయితే దీని కోస‌మే జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను పిఠాపురం నుంచి జ‌గ్గంపేట‌కి మార్చుకున్నార‌ట‌. ఇదే స‌మావేశం పిఠాపురంలో కూడా నిర్వ‌హిచంవ‌చ్చు క‌దా మ‌రి జ‌గ్గంపేట‌లో ఎందుకు అంటే ఇక్క‌డ సెటంటిమెంట్ యాంగిల్ ఉందంటున్నారు వైసీపీ నాయ‌కులు. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కువ‌చ్చి వేరే కుంప‌టి పెట్టుకున్న వేళ పార్టీ పేరును జ‌గ్గంపేట నుంచే ప్ర‌క‌టించార‌ట జ‌గ‌న్. దీంతో పాటు పార్టీ గుర్తును కూడా జ‌గ్గంపేట నుంచే ప్ర‌క‌టించారు. 
 
ఇలా పార్టీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌న్ని జ‌గ్గంపేటలోనే జ‌రిగాయ‌ట‌. అందుకే ఈ సెంటిమెంట్ ను జ‌గ‌న్ ఉప‌యోగించి ఈ నెల‌29వ తేదిన పార్టీకి సంబంధించిన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు. చ‌రిత్ర‌కు మారుపేరుగా మారిన జ‌గ్గంపేట‌లో ఈ నెల 29న జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.