ప‌ట్టు వ‌ద‌ల‌ని జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 18:34:20

ప‌ట్టు వ‌ద‌ల‌ని జ‌గ‌న్

ప్ర‌తిక్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడుద‌వోలు నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కోన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా జ‌గ‌న్  పాద‌యాత్ర చేస్తున్నారు. ఇంత‌టి వ‌ర్షంలో కూడా జ‌గ‌న్ ను క‌లుసుకునేందుకు ప్ర‌జ‌లు తండోప తండాలుగు వ‌స్తున్నారు.
 
ఇక ఈ వ‌ర్షంలో ఆటో యూనియ‌న్ నాయ‌కుల‌ను జ‌గ‌న్ క‌లుసుకుని వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఈ వ‌ర్షంలో కాసేపు ఆటోను న‌డిపి యూనియ‌న్ నాయ‌కుల‌ను సంతోష‌పరిచారు జ‌గ‌న్. ఆ తర్వాత వారికి హామీ ఇస్తూ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం ఆటో కార్మికులకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ హామీ పట్ల ఆటోకార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
 
అలాగే ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పొగాకు రైతుల‌ను కూడా క‌లుసుకుని వారి స‌మ‌స్య‌ల‌ను వ‌ర్షంలోనే త‌డుస్తూ తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వారితో మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడి ప‌రిపాల‌న‌లో ప్ర‌తీ ఒక్క‌రికి అన్యాయం జ‌రిగింద‌ని అన్నారు. చివ‌ర‌కు అన్నం పెట్టే రైతులని చూడ‌కుండా వారిని కూడా దోచుకుంటున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.