పాదయాత్రను ఆపేస్తున్న జగన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 01:48:28

పాదయాత్రను ఆపేస్తున్న జగన్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వ పాల‌న తీరును ఎండ‌గ‌డుతూ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న జ‌గ‌న్, న‌వ‌ర‌త్నాల‌ను కూడా  ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
అయితే ఇటీవ‌ల కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జ‌రిగిన నేప‌థ్యంలో  పాద‌యాత్రను కొన‌సాగించ‌డం స‌రైన‌ది కాద‌ని భావించిన వై య‌స్ జ‌గ‌న్.. గురువారం నాడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా  జ‌ర‌గ‌బోయే బంద్ ను విజ‌య‌వంతం చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు. శుక్ర‌వారం నాడు కోర్టుకు హ‌జ‌రు కావాల్సి ఉండ‌టంతో శ‌నివారం  నాడు  మ‌ర‌లా య‌దావిధిగా పాద‌యాత్ర ప్రారంభం అవ‌నుంది. 
 
గురువారం  ప్ర‌జా సంఘాలు, వామ‌ప‌క్షాలు ఇచ్చిన బంద్ పిలుపుకు వైసీపీ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బంద్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా  మండ‌ల స్ధాయిలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా  పార్ల‌మెంట్ లో వైసీపీ ఎంపీలు  నిర‌స‌న గ‌ళం కొన‌సాగిస్తున్నారు
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.