ఈ బ్రిడ్జ్ కు వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:09:04

ఈ బ్రిడ్జ్ కు వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ఈ రోజు తూర్పు గోదావ‌రి జిల్లాలో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. తూర్పు గోదావ‌రి జిల్లా అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది విశాల‌మైన‌ వాతావ‌ర‌ణం, గోదావ‌రి న‌ది, ఆంధ్రాయాస, అలా చెప్పుకుంటూ పోతే ప్ర‌కృతికి మారు పేరు తూర్పు గోదావ‌రి జిల్లా. అందులో ముఖ్య‌మైన‌ది రోడ్ క‌మ్ రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కింద రైలు, బ్రిడ్జ్ పైన వాహనాలు వెళ్తాయి. 
 
ఇక ఈ బ్రిడ్జ్ మీద నేడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ప్ర‌యాణించ‌నున్నారు. ఇక ఈ బ్రిడ్జ్ మీద జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేసుకుంటే మ‌రో చ‌రిత్ర‌ను సృష్టించిన వారు అవుతారు. ఏంటి బ్రిడ్జ్ మీద న‌డిస్తే చ‌రిత్ర సృష్టించిన వారు ఎలా అవుతార‌ని చాలా మంది ప్ర‌శ్న. అయితే అదేదో తెలుసుకుందాం..రండి.
 
2003లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్రజా సమస్యల గురించి తెలుసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 'ప్రజా ప్రస్థానం' పేరిట పాదయాత్ర చేశారు. ఈ  పాద‌యాత్ర‌లో భాగంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి రోడ్ క‌మ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా తూర్పు గోదావ‌రి జిల్లాలోకి అడుగుపెట్టారు. త‌ర్వాత‌ వైఎస్ ఆర్ పాదయాత్రను గుర్తు చేస్తూ, ఆయన కుమార్తె, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టి, 2013 జూన్ 4న రోడ్ క‌మ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు.
 
ఇక ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను ముగించుకున్న జగన్ మోహ‌న్ రెడ్డి నేడు ఇదే వంతెనపై నుంచి నడుస్తూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించ‌నున్నారు. దీంతో వైఎస్ జ‌గ‌న్ మ‌రో చ‌రిత్ర‌ను సృష్టించ‌నున్నారు. అయితే ఇప్పుడే ఆయ‌న రాక కోసం వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అలాగే  బ్రిడ్జ్‌ రెయిలింగ్ పై 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల పొడవైన వైసీపీ జెండా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుండగా, నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న చీరలను ధరించిన 150 మంది మహిళలు, జగన్ కు 150 గుమ్మడికాయలతో దిష్టి తీసి, హారతిచ్చి, జిల్లాలోకి స్వాగతం పలకనున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.