హైకోర్టులో జ‌గ‌న్ పిటీష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-31 17:11:15

హైకోర్టులో జ‌గ‌న్ పిటీష‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్య‌క్తి కోడిపందాల‌కు వాడే క‌త్తితో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా జ‌గ‌న్ త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌పై జ‌రిగిన దాడిని ఏపీ పోలీస్ అధికారులు విస్మ‌రిస్తున్నార‌ని ఈ పిటీష‌న్ లో జ‌గ‌న్ పేర్కొన్నారు. 
 
అంతేకాదు ఈ కేసు కుట్ర‌కోణంపై స‌జావుగా ద‌ర్యాప్తు జ‌రిపించాలని ఆయ‌న న్యాయ‌స్థానానికి విజ్ఞ‌ప్తి చేశారు. 2017 న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుంచి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో తాను ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటు, ఏపీ ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను, వారి అవినీతికి ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నానని జ‌గ‌న్ పేర్కొన్నారు. 
 
తాను నిత్యం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్న నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో ఓ కొత్త‌నాట‌కాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చి త‌న‌ను హ‌త్య‌చేసేందుకు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని ఆయ‌న పిటీష‌న్ లో పేర్కొన్నారు. గ‌తంలో న‌టుడు శివాజి త‌న‌పై దాడి జ‌రుగుతుంద‌ని ఆ త‌ర్వాత అది ప్ర‌భుత్వ ప‌త‌నానికి దారి తీస్తుంద‌ని చెప్పార‌ని అయితే తాజా ప‌రిణామాలు చూస్తుంటే అది ఒక భారీ కుట్ర అని అర్థ‌మ‌వుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 

షేర్ :

Comments

0 Comment