ప్ర‌కాశంలో జ‌గ‌న్ ప్లాన్ ఇదేనా...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 06:53:29

ప్ర‌కాశంలో జ‌గ‌న్ ప్లాన్ ఇదేనా...?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొన‌సాగిస్తొన్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో ముగించుకుని ప్ర‌కాశం జిల్లాలోకి ప్ర‌వేశించింది. జ‌గ‌న్ పాద‌యాత్ర   ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని  చేరుకుంది.
 
జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌కాశం జిల్లా వైసీపీకి ఎంతో ప్ర‌త్యేకంగా మారిందనే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో  ఈ జిల్లాలో మొత్తం 12 స్ధానాలకు గానూ  6 స్దానాల్లో వైకాపా విజ‌యం సాధించింది. అయితే ఇందులో న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి వైకాపాకు షాక్ ఇచ్చారు. 
 
దీంతో ప్ర‌కాశం జిల్లాలో పార్టీ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌ల‌ను  ముందుండి న‌డిపించే నాయ‌కుల  కొర‌త ఏర్ప‌డింది. ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే వైసీపీలో చేరారు. ఇప్పుడు పార్టీని మ‌రింత ముందుకు తీసుకువెళ్లేందుకు బ‌ల‌మైన నాయ‌క‌త్వం కావాలి. 
 
దీంతో స్ధానికంగా ఉండే నాయ‌కుల‌కుక విశ్వాసాన్ని నింపేందుకు వైయ‌స్ జ‌గ‌న్  పాద‌యాత్ర‌లో వ్యూహాలు ర‌చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పాద‌యాత్ర‌ను ఈ జిల్లాలో పూర్తి స్ధాయిలో స‌క్సెస్ చేసి ఇత‌ర పార్టీ నాయ‌కుల‌ను వైసీపీలోకి వ‌చ్చేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. 
 
దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన బూచెప‌ల్లి కుటుంబాన్ని కూడా యాక్టీవ్ పాలిటిక్స్ లోకి తీసుకురానున్నారు. జ‌గ‌న్. ఇక వైవీ సుబ్బా రెడ్డి. బాలినేని లాంటి సీనియ‌ర్ నేత‌లు ఈ జిల్లాకు ,చెందిన వారే అన్న విష‌యం అంద‌రికీ తెలుసు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.