జ‌గన్ అదిరిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 18:39:42

జ‌గన్ అదిరిపోయే ప్లాన్

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయంగా ఎమ్మెల్యే సీట్ల పై త‌న దూకుడుతో ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌తో ముందుకు వెళుతున్నారు.. మ‌రో ప‌క్క ఇటుఎమ్మెల్యే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టిస్తూ త‌న‌కు అనుమానంగా ఉన్న సీట్ల పై సర్వేలు చేయించుకుంటూ ముందుకు వెళుతున్నారు..
 
ఈ స‌మ‌యంలో ప‌లు ఎంపీ సీట్ల పై ఇప్పుడు కొత్త‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి పార్టీ త‌ర‌పున.. ఇక ఎంపీలుగా కాస్త ఆర్దికంగా బ‌లంగా ఉన్న‌వ్య‌క్తులు నిల‌బ‌డితే పార్టీకి కూడా కాస్త ప‌ట్టుగా ఉంటుంది... ఇది  ఏ రాజ‌కీయ పార్టీ అయినా క‌చ్చితంగా చేయ‌వ‌ల‌సిన‌ రాజ‌కీయ వైకుంఠ‌పాళి అయితే  ఇప్పుడు జ‌గ‌న్ హామీ ఇచ్చారా, ఇవ్వ‌లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే ఓ లిస్టు ఇప్పుడు ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది.. వీరేనా వైసీపీ త‌ర‌పున పోటీ చేసే ఎంపీ అభ్య‌ర్దులు అంటున్నారు.
 
ఉత్త‌రాంధ్రా రాజ‌కీయాల్లో వైసీపీ త‌ర‌పున సీనియ‌ర్ గా ఉన్న బోత్స‌ఫ్యామిలీ నుంచి ఆయ‌న భార్య మాజీ మంత్రి బొత్సా ఝాన్సి ఎంపీగా బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది విజ‌య‌న‌గ‌రం నుంచి .. ఇటు కాకినాడ నుంచి కుర‌సాల కన్న‌బాబుకు కూడా అవ‌కాశం ఉంది అంటున్నారు ఎమ్మెల్యే లేదా ఎంపీగా.. ఆయ‌న పోటి చేసే అవ‌కాశం ఉంది అని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నారు..
 
ఇటు అన‌కాప‌ల్లి నుంచి స‌బ్బంహ‌రి పార్టీలోకి వ‌స్తే సీటు పై డైల‌మా ఉండేది ఆయ‌న టీడీపీకి ద‌గ్గ‌ర అవుతున్నారు. ఇటు ఉత్త‌రాంధ్రా నాయ‌కుడు మాజీ మంత్రి  కొణ‌తాల రీఎంట్రీ అయితే వైసీపీ త‌ర‌పున ఆయ‌న ఎంపీగా అన‌కాప‌ల్లి నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.
 
ఏలూరు స్థానాన్ని మ‌రో మాజీ ఐఏఎస్ అధికారి ఆశిస్తుండ‌గా, మాజీ మంత్రి త‌న‌యుడు అలాగే కోట‌గిరికి అవ‌కాశం ఎలాగో ఉంది.. ఇక రాజ‌మండ్రి సీటు పై సినీ ప్ర‌ముఖుడు కూడా చూస్తున్నారు.. ఓనిర్మాత త‌న తండ్రికి ఇక్కడ సీటు ఇప్పించాలి అని అనుకుంటున్నారు.. ఇటు మ‌రో ద‌ర్శ‌కుడు జిల్లాకు చెందిన వ్య‌క్తి ఎమ్మెల్యేసీటు లేదా ఎంపీ సీటు ఏలూరు రాజ‌మహేంద్ర‌వ‌రం నుంచి  కోరుతున్నారు.. కాని ఇది చ‌ర్చ‌ల్లో ఉంది అని తెలుస్తోంది.
 
ఇటు న‌ర‌సాపురం నుంచి ముదునూరిని గ‌తంలో అనుకున్నా ఆయ‌న‌కు న‌ర‌సాపురం ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేయ‌డంతో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకున్నారు. కాపు వ‌ర్గానికి చెందిన ఓ ఫ్రోఫెస‌ర్ కు లేదా క్ష‌త్రియ‌వ‌ర్గానికి చెందిన భీమ‌వ‌రం నాయ‌కుడికి సీటు ఇచ్చే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది. ఇటు క‌నుమూరి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వ‌స్తే ఆయ‌న‌కు జ‌గ‌న్ న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. 
 
ఇటు మ‌చిలీప‌ట్నం నుంచి ఇంకా సీటు ఖ‌రారు కాలేదు.. అయితే ఓ ఎన్నారై ఇక్క‌డ సీటును ఆశిస్తున్నారు అని తెలుస్తోంది.. వైజాగ్ ఎంపీ అభ్య‌ర్దిగా  కాంగ్రెస్ నాయ‌కుడు వ‌స్తాను అని చెబుతున్నా, ఆయ‌న మ‌న‌వ‌డికి సీటు ఇవ్వాలి అని కోర‌డంతో జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్నారు.ఇటు అర‌కు పై ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది..శ్రీకాకుళంలో రెడ్డి శాంతిని కాద‌నుకుంటే కిల్లి కృపారాణికి కండువా క‌ప్పేయ‌డం ఖాయం అని అంటున్నారు.. ఇటు అమ‌లాపురం నుంచి హ‌ర్ష‌కుమార్ వ‌స్తే సీటు ప‌క్కా ఇటు, ముద్ర‌గ‌డ వ‌చ్చినా కుర‌సాల ప్లేస్ మార్చి ముద్ర‌గ‌డ‌కు కాకినాడ ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు. మొత్తానికి జ‌గ‌న్ ఈ ఎంపీ సీట్ల పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోనున్నారా అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.