కోన‌సీమ‌లో జ‌గ‌న్ ప్లాన్ స్టార్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-06-27 10:21:34

కోన‌సీమ‌లో జ‌గ‌న్ ప్లాన్ స్టార్ట్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తూర్పుగోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర‌తో దూసుకుపోతున్నారు... ఇక తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌పై ఆయ‌న ఫైర్ అయ్యారు..జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తెలుగుదేశానికి ఓట్లు వేసి అత్య‌ధికంగా సీట్లు ఇస్తే తెలుగుదేశం అధినేత చేసింది జిల్లాకు ఏమీ లేద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు..ఇక జిల్లాలో టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో 14 ఎమ్మెల్యే సీట్లు టీడీపీకి  వ‌చ్చాయ‌ని అయితే చంద్ర‌బాబు మాత్రం ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఎటువంటి న్యాయం చేయ‌లేదు అని  ఎద్దెవా చేశారు.
 
ఇక వైసీపీ నాయ‌కుల‌పై -ఎమ్మెల్యేల‌పై అణిచివేత చేస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్ష పార్టీ  నాయ‌కుల ను సంత‌లో పశువుల్లా కొంటున్నారు అని ఆయ‌న ఫైర్ అయ్యారు.. అయినా రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి పార్టీ మారిన న‌లుగురు ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు అని ఆయ‌న  మండిప‌డ్డారు.
 
ఇక అమ‌లాపురం లో జ‌రిగిన భారీ బ‌హిరంగ సభ‌లో వైయ‌స్ జ‌గ‌న్ తెలుగుదేశం పై ఓ రేంజ్ లో విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు..చంద్ర‌బాబు కాపుల‌ను ఎన్నిక‌ల కోసం వాడుకుంటున్నారు అని అన్నారు.. ఇక రిజ‌ర్వేష‌న్ల అమ‌లుపై ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తే మాత్రం మాట దాట‌వేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.. కాపుల‌కు వ‌చ్చే రోజుల్లో మ‌న ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది అని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌యంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మ‌ని అడిగినా వారి తాట తీస్తా అని బెదిరిస్తున్నారు అని ఆయ‌న మండిప‌డ్డారు. ఇక్క‌డ ఇసుక దందా కూడా యదేచ్చ‌గా జ‌రుగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.. చంద్ర‌బాబు అర‌చేతిలో వైకుంఠం స్వ‌ర్గం చూపిస్తున్నారు అని ఫైర్ అయ్యారు జ‌గ‌న్ ..జ‌న్మ‌భూమి క‌మిటీల‌తో చంద్ర‌బాబు ప్ర‌జా ధ‌నాన్ని వారి నాయ‌కుల‌కు దోచి పెడుతున్నార‌ని ప్ర‌తీ చోట లంచం చివ‌ర‌కు చిన‌బాబు చేతిలోకి వెళుతోంది అని ఎద్దెవా చేశారు.
 
జ‌గ‌న్ స్పీచ్ తో అమ‌లాపురం స‌భ స‌క్సెస్ అయింది.. వేలాది మంది వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ స‌భ‌లో పాల్గొని విజ‌యవంతం చేశారు.ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో అలాగే కోన‌సీమ‌లో జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇచ్చిన స్పీచ్ లో ఇది మ‌రో ట్రెండ్ సెట్ గా నిలుస్తోంది...ఇక్క‌డ నుంచి కాపుల‌కు హామీల ప్ర‌క‌ట‌న‌తో, తుని వ‌ర‌కూ జ‌గ‌న్ ఇటువంటి ఉత్సాహం కేడ‌ర్ లో నింప‌నున్నారు అంటున్నారు వైసీపీ నాయ‌కులు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.