జ‌గ‌న్ అస్త్రం స‌క్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 17:10:52

జ‌గ‌న్ అస్త్రం స‌క్సెస్

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నాయ‌కులు ప్ర‌క‌టించిన ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.అంతే కాదు ఈ 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ‌తంలో ఎవ‌రైతే జ‌గ‌న్ ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారో వారికి చంద్ర‌బాబు నాయుడు రాజ్యాంగ విరుద్దంగా మంత్రి ప‌ద‌వుల‌ను కూడా ఇచ్చారు.
 
ఇక ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో ఉన్న‌175 సీట్ల‌పై ఫోక‌స్ పెట్టారు. అందులో మ‌రీ ముఖ్యంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల సెగ్మెంట్ ల‌పై ఎక్కువ‌గా కాన్సట్రేష‌న్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిని ఎలాగైనా దెబ్బ కొట్టాల‌నే ఉద్దేశ్యంతో ఒక ప‌క్క పాద‌యాత్ర చేస్తూ మ‌రో ప‌క్క వ్యూహాలు ర‌చిస్తోన్నార‌ట‌.
 
ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ఆళ్ళ‌గ‌డ్డ‌, జగ్గంపేట‌, విజ‌య‌వాడ వెస్ట్, కోడుమూరు, పాడేరు, ప‌ల‌మ‌నేరు, నంద్యాల‌, గిద్ద‌లూరు, జ‌మ్మ‌ల‌మ‌డుగు, వంటి నియోజ‌కవ‌ర్గాల్లో ఎక్కువ‌గా శ్ర‌ద్ద పెట్టార‌ట. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ మూడు సార్లు స‌ర్వేల‌ను నిర్వ‌హించింద‌ట‌. మొద‌ట‌గా ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయం ఏంటి అనే దాని పై స‌ర్వే నిర్వహించార‌ట‌. ఇక రెండ‌వది ప్ర‌భుత్వంపై జ‌నాల్లో వ్య‌తిరేక‌త‌, ఇక మూడోదేమో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ర‌పున ఎవ‌రైతే గ‌ట్టి అభ్య‌ర్ధి అవుతారో వారిపై ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తెలుసుకున్నార‌ట‌.
 
ఇక ఈ స‌ర్వే త‌ర్వాత అభ్య‌ర్తుల నియామ‌కం అంశాల‌కు సంబంధించి బాధ్య‌త‌ల‌ను వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి అప్ప‌గించార‌ట జ‌గ‌న్. ఇక జ‌గ‌న్ స్కెచ్ కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అదే నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీకి దించితే క‌చ్చితంగా వైసీపీకి సానుభూతి పెరుగుతుంది. దీంతో వైసీపీ గెల‌వ‌డం దాదాపు ఖాయం అవుతోంది. ఇక వారి స్థానంలో వేరే వాళ్ల‌ను నిల‌బెడితే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ఏం స‌మాధానం చెప్పాలి అన్న విష‌యంపై చంద్ర‌బాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నార‌ట‌. మొత్తానికి జ‌గ‌న్ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేసిన అస్త్రం విజ‌య‌వంతం అయింద‌నే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.