జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-04 18:18:21

జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

ప్ర‌తిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఎన్నికల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను పునరావృతం కాకుండా ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ స్థాపించి ఎనిమిది సంవ‌త్స‌రాలు అవుతున్నా మొన్న‌టి వ‌ర‌కూ పార్టీ అనుభంద సంఘాల‌ను బ‌లోపేతం చేయ‌డం కానీ వాటి ప‌నితీరును దృష్టి పెట్ట‌లేదు. వీటిపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు అయ్యామ‌ని జ‌గ‌న్ భావించారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాటిని ఓ గాడిన పెట్టాల‌ని నిర్ణయం తీసుకున్నారు. 
 
అందులో భాగంగా అన్ని క‌మిటీల‌ను ఏర్పాటు చేసి వ‌రుస స‌మావేశాల‌ను నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే విజ‌య‌వాడ రాష్ట్ర కార్యాలయంలో బీసీ, మ‌హిళా స్టూడెంట్, యూత్, మైనార్టీ మీటింగ్ ల‌ను నిర్వ‌హించారు. గ్రామ స్థాయిలో క‌మిటీల‌ను ఏర్పాటు చెయ్యాల‌ని ఆయా వ‌ర్గాల వారిగా ఎదురు అవుతున్న స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారంపై నివేదిక‌ను ఇవ్వాల‌ని జ‌గ‌న్ జిల్లా నేత‌ల‌కు సూచించారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన‌ బీసీ స‌దస్సుకు స్వ‌యంగా హాజ‌రు అయిన జ‌గ‌న్ వారికి పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. 
 
ఇక ఇచ్చాపురంలో పాద‌యాత్ర ముగిసే రోజు నాలుగు పేజీల మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్నారు జ‌గ‌న్. పాద‌యాత్ర త‌ర్వాత అనంత‌పురం జిల్లా నుంచి బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా జ‌గ‌న్ బీసీల‌తో భారీ స‌భ నిర్వ‌హించి బీసీల‌కు డిక్ల‌రేష‌న్ నిర్వ‌హించాల‌ని వైసీపీ భావిస్తోంది. ఆ దిశ‌గా ప్ర‌ణాళిక‌ల‌ను కూడా సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి ఎట్టి ప‌రిస్థితిలోను అధికారంలోకి రావాల‌న్న నేప‌థ్యంలో జ‌గ‌న్ అందులో భాగంగా అన్ని వ‌ర్గాల‌ను మెప్పించి త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.