బాబుకు బీపీ పెంచే లిస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 16:56:49

బాబుకు బీపీ పెంచే లిస్ట్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర 2000 కిలోమీట‌ర్లు అదిగ‌మించ‌నున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు గుర్తుగా ఒక మొక్క‌ను నాటి వైసీపీ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు.ఇక ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌న్.
 
2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించార‌ని, ఏపీలో 13 జిల్లాలు ఉంటే ఒక్కొ జిల్లాకు ఆయా ప్ర‌జ‌లను  ఉద్దేశించి అనేక‌ హామీలు ప్ర‌క‌టించార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి వ‌చ్చి సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచినా కానీ చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీల్లో  పది శాతం కూడా నెర‌వేర్చ‌లేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. దీంతోపాటు రాజ‌ధాని నిర్మాణంకోసం కేంద్ర ప్ర‌భుత్వం నుంచి 1,500 కోట్లు తీసుకుని ఒక్క శాశ్వత భవ‌నం కూడా నిర్మంచ‌లేద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.
 
ఇక చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఏంటో చూద్దాం. 
 
మొద‌టగా పోలవరం ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేస్తానని నమ్మించిన చంద్రబాబు చివరకు ఘోరంగా విఫలమయ్యారు.
 
ఇక రెండ‌వ‌ది అతి ముఖ్య‌మైన‌ది.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయ‌న చేసిన ఐదు సంత‌కాల్లో భాగమైన బెల్ట్‌షాపులు మూతపడలేదని. అలాగే ప్ర‌తీ ఇంటికి 20 లీటర్ల మినరల్‌ వాటర్ ఇస్తామ‌ని చెప్పార‌ని అన్నారు
 
అలాగే పూర్తిగా రైతుల‌కు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామ‌ని, దీంతోపాటు డ్వాక్రా మ‌హిళ‌లకు రుణ‌మాఫీ  చేస్తామ‌ని చెప్పారు చంద్ర‌బాబు, కానీ ఇంత‌వ‌ర‌కూ ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేదు. కాబట్టి చంద్ర‌బాబు సంతకాలకు విలువ‌ లేకుండా పోయింద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.
 
నిన్న మొన్నటి వరకూ బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా వుండి కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరని అన్నారు.
 
అలాగే రాష్ట్రంలో 3,600 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయంటే ఇంతకు మించిన వైఫల్యం మరొకటి ఉండదని జ‌గ‌న్ విమ‌ర్శించారు.
 
ఇక మ‌రీ ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్న‌డూ జ‌రుగ‌ని విధంగా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, మాన‌భంగాలు అధికంగా జ‌రుగుతున్న‌య‌ని జ‌గ‌న్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.