జ‌గ‌న్ ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమానికి ఎక్క‌డ పాల్గొంటారంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-19 13:34:20

జ‌గ‌న్ ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమానికి ఎక్క‌డ పాల్గొంటారంటే

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ వంటి  అంశాల‌ను కేంద్రం ప్ర‌క‌టించ‌కపోవ‌డంతో కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి ప‌క్షాలు, మిత్ర ప‌క్షాలు నిర‌స‌న‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే... ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌తి ప‌క్ష  కాంగ్రెస్ పావైయ‌స్సార్ర్టీ  అధిష్టానం మేర‌కు ఆ పార్టీ ఎంపీలు లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం పెట్టారు.
 
అయితే ఈ తీర్మానం ఈ రోజు చ‌ర్చ‌కు రానున్న నేప‌థ్యంలో ప్ర‌తి ప‌క్ష‌పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లతో చ‌ర్చించారు... ఈ చ‌ర్చ‌లో భాగంగా నేడు రాష్ట్ర‌ వ్యాప్తంగా ప్ర‌జా సంక‌ల్ప మాన‌వ హార కార్య‌క్ర‌మాన్ని వైయ‌స్సార్‌ పార్టీ నేత‌లు చేప‌ట్ట‌నున్నారు... ఈ కార్యక్రమానికి  పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు పాల్గొని రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్ష ఢిల్లీకి తెలిసి వచ్చేలా ప్రజా సంకల్ప మానవహారాన్ని విజయవంతం చేయాలని జ‌గ‌న్ సూచించారు.. 
 
అందులో భాగంగానే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగు అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌న‌ను ఎండ‌గ‌డుతూ, నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు వైఎస్ జ‌గ‌న్... కాగా ఆయ‌న‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తెలుగు దేశం పార్టీ నాయ‌కుల కంచుకోట గుంటూరు జిల్లా ప్ర‌త్తి పాడు నియోజ‌క వ‌ర్గంలో కొన‌సాగుతోంది... అక్క‌డి నుంచి  పాదయాత్ర మార్గంలో  కాకుమాను మండలం కొమ్మూరు వద్ద ప్రజా సంకల్ప మానవహారంలో ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.. 
 
కాగా పేరుకు మాత్ర‌మే టీడీపీకి కంచుకోట అయినా జ‌గ‌న్ అక్క‌డ అడుగు వేయ‌డంతో రాజ‌కీయాలు పూర్తి స్థాయిలో తారుమారు అయ్యాయి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.