జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా జిల్లాలో మ‌రో ఘ‌న‌త

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-20 10:43:49

జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా జిల్లాలో మ‌రో ఘ‌న‌త

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ  కంచుకోట అయిన కృష్ణా జిల్లా మైల‌వ‌రం సెగ్మెంట్ గణపవరంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది...ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు..ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జ‌గ‌న్.
 
ఈ నేప‌థ్యంలో గత ఏడాది నవంబరు 6న ప్రారంభించిన పాదయాత్ర మ‌రో మైలురాయిని అధిగ‌మించింది.. ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ , ప్ర‌కాశం, నెల్లూరు గుంటూరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణాజిల్లా మైల‌వ‌రం సెగ్మంట్ లో కొన‌సాగుతోంది.. ఈ సెగ్మెంట్ లో 1800  కీ మీ పూర్తి చేసిన సంద‌ర్భంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గణపవరం వద్ద ఒక మొక్క‌ను నాటి అదే ఊరులో పార్టీ జెండాను ఆవిస్క‌రించారు. ఈ సంద‌ర్భంగా గణపవరంలో వైసీపీ శ్రేణుల  జ‌గ‌న్ కు ఘన స్వాగతం..
 
ప్రజాసంకల్పయాత్ర ఇలా సాగుతోంది...
 
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)
 
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
 
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)
 
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)
 
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
 
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)
 
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబరు ‌24, 2017)
 
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
 
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
 
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
 
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
 
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
 
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
 
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
 
1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
 
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
 
1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
 
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
 
1800- కృష్ణా జిల్లా  మైల వరం నియోజకవర్గం గణపవరం ( ఏప్రిల్‌18, 2018)
 
బాబుది దొంగ దీక్ష
గణపవరంలో వైసీపీ జెండాను ఆవిష్క‌రించిన జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై మ‌రోసారి నిప్పులు చెరిగారు... పార్ల‌మెంట్ చివ‌రి రోజున స్పీక‌ర్ స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసిన‌ప్పుడు వైసీపీ ఎంపీల‌తో పాటు చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే దేశం మొత్తం మ‌న రాష్ట్రం వైపు చూసేద‌ని అన్నారు.
 
త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌లేని చంద్ర‌బాబు త‌న జ‌న్మ‌దినం రోజున నిరాహాదీక్ష పేరుతో దొంగ దీక్ష చేస్తున్నార‌ని, ప్ర‌జ‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని అన్నారు... ఇదంతా చంద్ర‌బాబు త‌మ‌ రాజీనామాల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఒక్కరోజు దీక్షకు కూర్చుంటున్నారని ఆరోపించారు... ప్ర‌తీ ఒక్క విష‌యాన్ని క్షుణ్ణంగా గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు త‌గిన‌ గుణ‌పాటం చెబుతార‌ని జ‌గ‌న్ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.