చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-08 15:31:23

చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షులు, గుడివాడ అమ‌ర్ నాథ్ అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ గ‌న్న‌వ‌రం మెట్ట‌వ‌ద్ద విశాఖ జిల్లాలోకి అడుగు పెడుతార‌ని అమ‌ర్ నాథ్ స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ జిల్లాలోకి అడుగు వెయ్య‌గానే ప్ర‌తీ ఒక్క‌రు ఆయ‌న‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు.
 
అయితే ఇప్ప‌టికే 102 నియోజ‌క‌వర్గాల‌ను త‌న పాద‌యాత్ర ద్వారా  వైఎస్ జ‌గ‌న్  పూర్తి చేసుకున్నార‌ని, ఆయ‌న ఆడుగు పెట్టిన ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వారి స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా వైసీపీ అధికారంలోకి రాగానే ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చుతాన‌ని కొండంత భ‌రోసా ఇస్తున్నార‌ని అమ‌ర్ నాథ్ తెలిపారు. విశాఖ‌లో అడుగు పెట్టబోతున్న జ‌గ‌న్ సుమారు 210 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేస్తార‌ని, ఈ పాద‌యాత్ర‌లో వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన 7 బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటార‌ని అమ‌ర్ నాథ్ తెలిపారు. అంతేకాదు జిల్లాలో ఉన్న గిరిజ‌నుల‌కు జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇస్తారని అమ‌ర్ నాథ్ స్ప‌ష్టం చేశారు.
 
రాష్ట్ర విభ‌జ‌న జరిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా కోసం నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా వైఎస్ జ‌గ‌న్ పోరాడుతున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేకాదు రాష్ట్రానికి హోదా అమ‌ర సంజీవ‌ని అని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఊపిరి అని వైసీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేశార‌ని ఆయ‌న తెలిపారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌తీ అంశం పై వైసీపీ నాయ‌కులు కేంద్ర‌ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నార‌ని అమ‌ర్ నాథ్ స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.