జ‌గ‌న్ కు ప్ర‌భంజ‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy prajasankalpa yatra machilipatram
Updated:  2018-05-01 19:03:29

జ‌గ‌న్ కు ప్ర‌భంజ‌నం

ప్ర‌తిప‌క్ష‌నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర నేడు మ‌చిలీప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... జ‌న‌నేత‌తో అడుగులో అడుగు వేస్తూ నేనున్నాను అన్నాఅంటూ ప్ర‌తీ చోట ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు నీరాజ‌నాలు ప‌లుపుతున్నారు... అయితే ఈ సంక‌ల్ప‌యాత్ర నేటితో 150 రోజుల‌ను పూర్తి చేసుకుంది.
 
ఇక తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా నేడు మ‌చిలీప‌ట్నంలో  ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో జగ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ప్ర‌మాణ స్వీకారం చేసేట‌ప్పుడు నాలుగు సంత‌కాలు చేశార‌ని ఈ సంత‌కాల్లో మొద‌టి సంత‌కం బెల్టు షాపుల‌ను బంద్ చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు... అయితే చంద్ర‌బాబు ఎప్పుడు అయితే సంత‌కం చేశారో అప్ప‌టి నుంచి విప‌రీతంగా బెల్టు షాపులు పెరిగిపోయాయ‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
అలాగే చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియా ద్వారా ఎప్పుడు త‌మ పార్టీ రైతుల పార్టీ అని చెప్పుకునే అయ‌న ఇప్పుడు ఎక్క‌డ చూసినా రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే వాటి గురించి ఒక్క‌సారి అయినా అసెంబ్లీలో చ‌ర్చించారా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు...అసెంబ్లీలో  ప్ర‌తిప‌క్షాలు లేని స‌మ‌యంలో వారికి అనుకూలంగా బిల్లుల‌ను పాస్ చేసుకున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు... ఇక దీంతో పాటు చంద్ర‌బాబు మ‌చిలీప‌ట్నంలో అక్ర‌మంగా ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి ఫ్లాట్ల‌ను మూడు ల‌క్ష‌ల‌కు కొని వాటిని ఆరు ల‌క్ష‌ల‌కు అమ్ముతున్నార‌ని మండిప‌డ్డారు.
 
ఇక ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు కేంద్రానికి అమ్ముడుపోయార‌ని, గ‌తంలో ప్ర‌త్యేక హోదా అంటే అక్ర‌మంగా అరెస్ట్ చేయించార‌ని అన్నారు... అయితే ఇప్పుడు చంద్ర‌బాబు  ఏ ముఖం పెట్టుకుని ప్ర‌త్యేక హోదా అంటూ ధ‌ర్మపోరాట దీక్ష‌ చేస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు... ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఏపీ భ‌వ‌న్ లో నిరాహాదీక్ష చేస్తే వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా త‌ప్పించుకు తిరిగార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
అయితే ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు ప‌డుత‌న్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి ఇంటికి ఒక మ‌నిషిని పంపిస్తార‌ని, వారితో ఇంటికి ఒక బెంజికారు, మూడు వేలు , కిలో బంగారం ఇస్తామ‌ని చెప్పి పంపిస్తార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.. అయితే మాకు మూడు వేలు కాదు ఐదువేలు కావాలంటూ డిమాండ్ చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేశారు.. ఆ డ‌బ్బంతా ప్ర‌జ‌ల‌దేన‌ని, ఓటు వేసేట‌ప్పుడు మ‌న‌స్సాక్షి చెప్పిన వారికి వేయాల‌ని జ‌గ‌న్ తెలిపారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.