జ‌నం మ‌దిలో జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 13:12:44

జ‌నం మ‌దిలో జ‌గ‌న్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర మ‌రో మైలురాయిని అదిగ‌మించింది. వైఎస్ ఆర్ క‌డ‌ప జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో నవంబరు 6, 2017న‌ మొద‌లైన‌ ఈ సంక‌ల్ప‌యాత్ర నేడు తెలుగుదేశం పార్టీ కంచుకోట ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.ఇక ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్  2000 వేల కీ.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న నేప‌థ్యంలో పాద‌యాత్ర‌కు గుర్తుగా ఇక మొక్క‌ను నాటి పార్టీ జెండాను ఆవిస్క‌రించారు.
 
అలాగే ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.  ఈ సంక‌ల్ప‌యాత్ర‌తో  రాష్ట్ర  ముఖచిత్రం కూడా శర వేగంగా మారుతోంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏపీకి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా మొద‌లుకుని 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీల‌న్నిసామాజిక మాథ్యమాల్లోనూ ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
 
రాజ‌కీయంగా అనుభ‌వజ్ఞుడు అయిన చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌గ‌ల‌డ‌ని భావించి ఆయ‌న‌కు అధికారం చేతిలోపెట్టారు ప్ర‌జ‌లు. ప్ర‌జా అండ‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కూ రాష్ట్రానికి చేసింది ఏమిలేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇది కొద్దిరోజుల మాట‌, కానీ ఇప్పుడు క‌చ్చితంగా జ‌గ‌న్ కు ఛాన్స్ ఇవ్వాల్సిందే అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. నిజ‌మైన నాయ‌కుడు అని భావించి రోజు రోజుకు జ‌న‌నేత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు పెరిగిపోతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.