అవిశ్వాసంపై జగన్ ప్రెస్ మీట్ హైలైట్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-21 14:53:53

అవిశ్వాసంపై జగన్ ప్రెస్ మీట్ హైలైట్స్

1. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలు చూస్తే చాల బాధ అనిపించింది...
 
2. బీజేపీ నుండి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీతో పాటు, మిగిలిన అన్ని పార్టీలతో సహా ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు...
 
3. ఆనాడు కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షంతో క‌లిసి చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టారు...
 
4. ఏపీకి ఇచ్చిన హామీలు నాలుగు ఏళ్ళు గా మర్చిపోయారు...
 
5. తిరుపతి సభలో మోడీ, చంద్రబాబు కలిపి ప్రత్యేక హోదా హామీని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తూట్లు పొడిచారు...
 
6. ఇరు పార్టీలు తమ మానిఫెస్టోలో ప్రత్యేక హోదాను పెట్టారు....అధికారంలోకి వచ్చాక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కుమ్మకై ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు...
 
7. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యక ప్యాకేజీ ఇవ్వండి అని అడిగారంటే చంద్రబాబుకు రాష్ట్రా ప్రయోజనాలపైనా ఏ మాత్రం చిత్తశుద్ధిలేదు...
 
8. అసలు కేంద్రంతో రాజీపడటానికి చంద్రబాబు ఎవరు? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టె హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు...
 
9. యూ - టర్న్ రాజకీయాలు చేయడం, అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం...
 
10. రాహుల్ ప్రసంగంలో ఏపీ గురించి ఒక్క అర నిముషం కూడా మాట్లాడలేదు...
 
11. గల్లా జయదేవ్ మాట్లాడిన మాటలు...మేము నాలుగేళ్లుగా మాట్లాడిన మాటలే కథ..కొత్తగా ఏమైనా మాట్లాడారా...
 
12. హోదా ఏమైనా సంజీవన అని మాటలు హోదాకు రాయితీలకు సంబంధం లేదని మహానాడులో తీర్మానం చేస్తారు...
 
13. అరుణ్ జైట్లీ చంద్రబాబు చర్చించి ప్యాకేజీ ప్రకటిస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తే...ఈ పెద్ద మనిషి అర్థరాత్రి మీటింగ్ పెట్టి స్వాగతం పలకడం..
 
14. ప్యాకేజి బాగుందంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం రాష్ట్ర ప్రజలను వంచించడం కాదా?
 
15. అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని పదే పదే పొడిగించింది చంద్రబాబు కాదా 
 
16. నాలుగేళ్లుగా టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండి ఒక్కరోజైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా?
 
17. మా ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం ఏపీ వైపు చూసేది కాదా 
 
18. ఎన్టీఆర్ బయోపిక్ అంటారు ఆ షూటింగ్ లో వెంకయ్య నాయుడు ఉంటారు
 
19. బీజేపీ మంత్రి భార్యకు టీటీడీలో పదవి ఇస్తారు..
 
20. ఒక వైపు యుద్ధం అంటారు...మరో వైపు లోపాయికార ఒప్పందం చేసుకుంటారు..
 
21. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తారు హోదాకు తూట్లు పొడుస్తారు...ఎన్నికలకు ఆరు నెలల ముందు విడాకులు తీసుకొని హోదా అంటారు.
 
22. కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుకు నిర‌స‌న‌గా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.