జ‌గ‌న్ ప్రామీస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 12:58:50

జ‌గ‌న్ ప్రామీస్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలో నిర్విరామంగా కోన‌సాగుతోంది. ఈ  సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికార  బ‌లంతో చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా తాడేప‌ల్లి గూడెంలో భారీ భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు వైసీపీ నాయ‌కులు. ఈ భ‌హిరంగ స‌భ‌లో మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు జ‌గ‌న్.
 
చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేల‌కు రౌడీ ఇజం, గుండాఇజం ఎలా చేయాలో   శిక్ష‌ణ ఇచ్చార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు హ‌యాంలో మట్టి, ఇసుక, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, విశాఖ భూములు, గుడి భూములు ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి ఆలయ ఆభరణాలను దోచేస్తున్న స్థితికి తీసుకువచ్చార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌ని, అయితే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయింద‌ని, ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో చంద్ర‌బాబు ఒక్క‌చోట అయినా అభివృద్ది కార్య‌క్ర‌మం చేశారా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అలాగే రాష్ట్రంలో నివ‌సిస్తున్న రజకులు, మత్స్యకారులను ఎస్సీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తామని, కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే ఓట్లేసిన మత్స్యకారులు వెళ్లి నాలుగేళ్లు అయిపోతోందయ్యా  మమ్మల్ని ఎస్సీలుగా ఎప్పుడు చేస్తారు అని చంద్రబాబును అడిగితే తాటతీస్తా అని బెదిరించార‌ట‌.
 
అలాగే కాపునేత‌లు కూడా త‌మ‌ను బీసీల్లో ఎప్పుడు చేర్చుతారు అని అడిగితే వారిపై చంద్ర‌బాబు అక్ర‌మంగా అధికారుల‌తో కొట్టించార‌ని, అడ్డువ‌చ్చిన వారిని దొంగకేసులు పెట్టించడం, ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టించడం వంటి కార్వ‌క్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఇంత‌టితో ఆగ‌కుండా అక్ర‌మంగా  హౌస్‌ అరెస్టులు చేయించార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
2014 లో చంద్ర‌బాబు ఆచ‌ర‌ణ‌కు సాధ్యంకానీ హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి  అధికారంలోకి వ‌చ్చార‌ని, అయితే ఆయ‌న‌లాగా నేను 2019లో ఎన్నిక‌ల్లో సాధ్యం కానీ హామీల‌ను ప్ర‌క‌టించన‌ని అన్నారు. ఆనాడు దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాపుల‌ను ఎలా గుండెల్లో పెట్టుకుని చూశారో తాను కూడా అదే రీతిలో కాపుల‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
 
అలాగే వైసీపీ అధికారంలోకి ఇలా చేస్తాం
 
1 వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం
 
2 మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు     చేయిస్తాం.
3 ఆపరేషన్‌ పూర్తయ్యాక పనులు చేసుకోలేరు కాబట్టి వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో ఆర్థిక సాయం అందిస్తాం.
 
4 ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
 
5 కిడ్నీలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం
 
6 క్యాన్సర్‌ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్‌ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.