ఆ యంగ్ లీడ‌ర్ కు హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:34:33

ఆ యంగ్ లీడ‌ర్ కు హామీ

తెలుగుదేశంలో సీట్ల కోసం ఆశ‌లు పెట్టుకోవ‌క్క‌ర్లేదు అంటారు...న‌గ‌దు ఉందా నీకు కేడ‌ర్ తో సంబంధంలేదు సీటు నీకే, బీఫాం నీకే, అనే రేంజ్ లో సీట్ల పంప‌కాలు ఉంటాయి అంటారు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు...ఇక ఎంపీ సీట్లు అంటే చంద్ర‌బాబు కేవ‌లం వ్యాపార‌స్తుల‌కు పారిశ్రామిక వేత్త‌ల‌కు మాత్ర‌మే ఇస్తారు అనే పేరు ఏనాడే వేయించుకున్నారు..అయితే రాజ్య‌స‌భ‌లో మ‌రింత విశేషంగా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారికి మాత్ర‌మే ఇస్తారు.. ఇక ఏపీ రాజ‌ధాని అయిన అమ‌రావ‌తిలో  గుంటూరు జిల్లా విజ‌యవాడ‌లో ఎంపీ సీట్ల కోసం ఇప్ప‌టి నుంచే నాయ‌కులు ఇరు పార్టీల్లో క‌ర్చీఫ్లు వేసుకుంటున్నారు.
 
అయితే మెజార్టీ తెలుగుదేశం ఇక్క‌డ ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డంతో వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఓటమి పాలైంది ఎంపీ స్ధానాల్లో.. అయితే జ‌గ‌న్ ఇప్పుడు  అమ‌రావ‌తికి కేంద్రబిందువు లాంటి గుంటూరు సీటు పై ఎన్నిక‌ల‌కు ఓ సంవ‌త్స‌రం ఉండ‌గానే క్లారిటీ ఇచ్చారు ఓ నాయ‌కుడికి... ఇక జ‌గ‌న్ గుంటూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో కూడా ఆ హామీ ఇచ్చిన వ్య‌క్తి జ‌గ‌న్ కు వెన్నంటి ఉన్నారు.
 
ప్రముఖ విజ్ఞాన్  విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య వారసుడు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో యాక్టీవ్ గా ఉంటున్నారు... గుంటూరు జిల్లాలో పేరు ఉండ‌టం సామాజిక వ‌ర్గం మెజార్టీగా వారికి మ‌ద్ద‌తు ఉండ‌టం... అలాగే విద్యాసంస్ద‌ల ద్వారా పేరు గ‌డించ‌డం జిల్లాలో ఆ ఫ్యామిలీకి పెద్ద పేరు ఉంది.. ఇక ఎంపీగా ఆయ‌న పోటీ చేయడానికి ఉత్సాహాం చూప‌డం వైసీపీ అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కు సీటు ఫిక్స్ చేశారు జ‌గ‌న్.
 
లావురత్తయ్య గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు... ఎన్నికలకు ముందే  తెలుగుదేశంలో ఆయ‌న గుంటూరు న‌ర‌స‌రావు పేట సీట్లు ఆశించారు... అయితే అప్పుడు గ‌ల్లా జ‌య‌దేవ్ అలాగే రాయ‌పాటి సీట్లుసంపాదించి విజ‌యం పొందారు... ఇక ఆయ‌న పార్టీలో చేరినా త‌న‌యుడు రాజ‌కీయం చూస్తున్నారు.. వైసీపీ త‌ర‌పున ఆయ‌న త‌న‌యుడు యాక్టీవ్ గా పార్టీలో  కొన‌సాగుతున్నారు.
 
గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే వైసీపీ కార్యక్రమాలకు కృష్ణదేవరాయలు వెళుతున్నారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన వల్లభనేని బాలశౌరి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడం కూడా ఆయనకు కలిసొచ్చింది అని చెప్పాలి... ఇక పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు వెన్నంటి ఆయ‌న ఉండ‌టం పాద‌యాత్ర‌లో ఆయ‌న వెంట తిర‌గ‌డం చూస్తుంటే జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కు సీటు ఇచ్చినట్లే అంటున్నారు..
 
అలాగే అన్ని సెగ్మెంట్ల‌లో వైసీపీ అభ్య‌ర్దులు విజ‌యానికి ఆయ‌న కృషి ఉంటుంది అని, జ‌గ‌న్ న‌మ్మి  హామీ ఇచ్చారు అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. ఇక ఆర్ధికంగా బ‌లంగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్ కు స‌రైన ధీటుగా ఉండే నాయ‌కుడుగా ర‌త్త‌య్య కుమారుడు దేవ‌రాయ‌లు ఉంటారు అని అంటున్నారు... అయితే ఇక్క‌డ ఇరువురు ఆర్దికంగా ఉద్దండులే అయితే వచ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం గ‌ల్లా జ‌య‌దేవ్ కు సీటు ఇస్తుందా కొత్త ఫేస్ క‌నిపిస్తుందా చూడాలి... అయితే ఎవ‌రు నిలుచున్నా ఈ యువ నాయ‌కుడికి  విజ‌యం ప‌క్కా అని అంటున్నారు అక్క‌డ ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.