జ‌గ‌న్ ఏడు సూటి ప్ర‌శ్న‌లు ఇవే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 15:07:33

జ‌గ‌న్ ఏడు సూటి ప్ర‌శ్న‌లు ఇవే

ఏపీలో ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోసం జ‌రుగుతున్న‌టువంటి పోరాటం ప‌తాక స్థాయికి చేరుకుంది.. కేంద్ర ప్ర‌భుత్వంపై పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీ.. పార్ల‌మెంట్ చివ‌రి రోజున ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే త‌మ పార్టీ ఎంపిల‌తో రాజీనామా చేయించి ఢిల్లీలో ఉన్న ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ చేస్తార‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే..
 
పార్ల‌మెంట్ చివ‌రి రోజు కూడా స‌భ‌లో అవిశ్వాస తీర్మానం చ‌ర్చించ‌కుండా కేంద్ర‌ప్ర‌భుత్వం నిర‌వ‌ధిక‌ వాయిదా వేసింది.. దీంతో వైసీపీ అధినేత‌ ఇచ్చిన‌టువంటి మాట‌కు క‌ట్టుబ‌డి ఎంపీలు  వారి రాజీనామా ప‌త్రాల‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించిన త‌ర్వాత ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహారా దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.. 
 
ఇక ఇదే విష‌యంపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుంటూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ‌త‌నాలుగు సంవ‌త్స‌రాలుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడ్డుకుంటున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.... ప్ర‌త్యేక హోదా కోసం త‌మ పార్టీ  ఎంపీలు ఎవ‌రూ చేయ‌లేని త్యాగం చేస్తున్నార‌ని అన్నారు.
 
ఇవాళ టీడీపీ నాయ‌కులు​ పోరాటం చేస్తే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని తెలిసి కూడా ముఖ్య‌మంత్రి వెన‌క‌డుగు వేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.. 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తే ఖచ్ఛితంగా దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది... దీంతో కేంద్రం దిగి వస్తుందని తెలిసి కూడా ఈరోజు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా చంద్ర‌బాబు డ్రామాలు ఆడుతున్నార‌ని అని జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 
అందులో భ‌గంగానే చంద్ర‌బాబుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏడు సూటీ ప్ర‌శ్న‌లు వేశారు...
 
1. ఫ్లానింగ్‌​ కమిషన్‌కు లేఖ ఎందుకు రాయలేదు? 
 
2. ప్యాకేజీని స్వాగతించింది నిజం కాదా?...
 
3. వృద్ధిరేటుపై తప్పుడు సంకేతాలివ్వలేదా?
 
4. నాలుగేళ్లలో మీరు చేసిందేంటి?
 
5. అవిశ్వాసం విషయంలో యూటర్న్‌ నిజం కాదా?
 
6. నల్లబ్యాడ్జీలతో హోదా వస్తుందా?
 
7. ఎంపీలతో రాజీనామా చేయించకపోవటం మోసం కాదా
 
 అని ఏడు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు వైసీపీ అధినేత‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.