జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-10-08 04:44:45

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డ్

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వారి గొత్తుకై నిలుస్తూ, అలాగే అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అస‌మ‌ర్థ‌త‌ను వెలుగులోకి తేవ‌డానికి ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఈ రోజు మ‌రో మైలురాయిని అదిగ‌మించింది. విజ‌య‌న‌గ‌రం జిల్లా  చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల మార్క్ ను చేరుకుంది. 
 
ఇక ఈ విశిష్ట సంద‌ర్భాన్ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పురస్క‌రించుకుని పాద‌యాత్ర‌కు గుర్తుగా వేప‌మొక్క‌ను నాటారు. గ‌త నెల విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కొత్త‌వ‌ల‌స దేపాత్రునిపాలెం వ‌ద్ద 3000 వేల కిలోమీట‌ర్ల‌ను పూర్తి చేసుకున్న పాద‌యాత్ర శృంగ‌వ‌ర‌పుకోట, గ‌జ‌ప‌తిన‌గ‌రం విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల‌ను పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. పాద‌యాత్ర‌లో నిత్యం క‌ల‌వ‌డానికి వ‌స్తున్న ప‌లువ‌ర్గాల‌తో మ‌మేకం అవుతూ వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వింటూ ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగిస్తున్నారు. 
 
కిలో మిట‌ర్ల పాద‌యాత్ర ఘ‌న‌త‌
 
0- వైఎస్సార్ జిల్లా, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇడుపుల పాయ‌
500- అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం గోట్లూరు
1000- నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురం
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం ములుకుదురు
2000- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మాదేప‌ల్లి
2500- తూర్పు గోదావ‌రి జిల్లా ప‌స‌ల‌పూడి శివారు
3000 విజ‌య‌న‌గ‌రం జిల్లా దేపాత్రునిపాలెం.
3100 విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.