జ‌గ‌న్ వార్ కు రెడీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 15:05:15

జ‌గ‌న్ వార్ కు రెడీ

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ కురుక్షేత్రానికి  రెడీ అవుతున్నారు.. మ‌రీ ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఓట‌మి త‌ర్వాత పార్టీ బ‌రువు బాధ్య‌త‌లు మ‌రింత సందిగ్ద ప‌రిస్దితుల్లో మోసుకుంటూ వ‌చ్చారు జ‌గ‌న్.. మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో నాయ‌కుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు..ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ఎన్ని సార్లు జ‌గ‌న్ ను రాజ‌కీయంగా ఇరుకున పెట్టాలి అని అనుకున్నా జ‌గ‌న్ మాత్రం త‌న మ‌నో దైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగారు.
 
ఇక ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు కుతంత్రాలు చేసి విజ‌యం సాధించిందో తెలిసిందే.... ఇక అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల‌ను కూడా నిర్విరామంగా చేసి, 23 మందిని వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించేలా చేసింది.. ఇక ఫిరాయింపులు అంశం ఎప్పుడు జ‌గ‌న్ ఎత్తినా రాజీనామా చెయ్యాల‌ని చెప్పినా వినే ప్ర‌స‌క్తే లేదు.. నాయ‌కులు మ‌రీ ముఖ్యంగా ఈ ఫిరాయింపుల‌లో న‌లుగురు మంత్రి ప‌దవులు కూడా చేస్తున్నారు, రాజ్యంగాన్ని అప‌హాస్యం చేసి మంత్రి ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు.
 
ఇక తెలుగుదేశం నాయ‌కులు వైసీపీ నాయ‌కులు పొలిటిక‌ల్ వార్ కొన‌సాగుతూనే ఉంది ఏపీలో గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాలుగా.. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీని క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. న‌వంబ‌ర్ లో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.. దీనికి టీఆర్ఎస్ కేడ‌ర్ సిద్దంగా ఉండాల‌ని అన్నారు ఆయ‌న‌. స‌గం మందికి ఆగ‌స్ట్ నెల‌ఖారులోగా టిక్కెట్లు ఫైన‌ల్ చేస్తామ‌నే సందేశాలు వ‌చ్చాయి.
 
ఇక తెలుగుదేశం నిద్రావ‌స్త‌లో ఉంటే వైసీపీ ఈ విష‌యంలో మేల్కొనే ఉంది.. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో 70 శాతం అభ్య‌ర్దుల‌ను ప్ర‌కటించారు.. అదే విధంగా వైసీపీ నాయ‌కులు కూడా సీట్ల విష‌యంలో జ‌గ‌న్ తో ముందుగానే ఒప్పందం చేసుకున్నారు..ఇటు టీడీపీ మాత్రం ఇంకా సిట్టింగులు రేసింగులు అంటూ స‌ర్వేల ద‌గ్గ‌రే ఉంది... మ‌రి డ్యాష్ బోర్డులే నిర్ణ‌యిస్తాయేమో సీట్లు ఎవ‌రికి అని  చూడాలి. జ‌గ‌న్ మాత్రం వార్ కు రెడీ అని ఇటు వైసీపీ నాయ‌కులు కూడా చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.