జ‌గ‌న్ ఎదుర్కోవ‌డానికి రాహుల్ అస్త్రం రెడీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 12:48:17

జ‌గ‌న్ ఎదుర్కోవ‌డానికి రాహుల్ అస్త్రం రెడీ

అస‌లు హ‌స్తిన‌లో అస్త్రాల‌కు లోటు ఏమి ఉంది....పైగా కాంగ్రెస్ పార్టీ సీడ‌బ్లూసీ మీటింగ్ పెట్టి నిర్ణ‌యం తీసుకున్నారు అంటే పెంట‌గాన్ సెక్యూరిటీ ఫోర్త్ టేబుల్ తీసుకునే నిర్ణ‌యాల కంటే క‌ఠినంగా ఉంటాయి కాంగ్రెస్ నిర్ణ‌యాలు.. దేశంలో అతి సీక్రెట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే పార్టీ ఏమైనా ఉంది అంటే అది కూడా కాంగ్రెస్ అని చెప్పాలి.
 
అయితే కాంగ్రెస్ 1975 ప్లాన్స్ వేస్తోంది.. ఇప్ప‌టికీ అదే తీరు అదే జోరు..నిజ‌మే ఆ పార్టీలో ఉన్న వారు అంతా కాస్త వ‌య‌సు అయిపోయిన సీనియర్ రాజ‌కీయ నాయ‌కులు.. మళ్లీ వాళ్ల‌నే పెట్టుకుని ఎన్నిక‌ళ్లోకి వెళ్లాలి అనే ఆలోచ‌న కాంగ్రెస్ పార్టీది.. ఇటు రాజ‌కీయాలు నేర్చుకున్న రాహుల్ త‌న త‌ల్లి సోనియాగాంధీ ఏ కోట‌రీతో అయితే ముందుకు వెళ్లిందో అదే కోట‌రితో ముందుకు వెళుతున్నారు..
 
ఓ జైరాంర‌మేష్ 
జైపాల్ రెడ్డి 
ఆంటోని 
చిదంబ‌రం
అహ్మ‌ద్ ప‌టేల్
ఆజాద్ 
ఉమెన్ చాందీ
 
వీరే ముఖ్యంగా క‌నిపిస్తున్నారు.. ఇటు సీనియ‌ర్లు కూడా వీరే, జూనియ‌ర్లు చెప్పిన సల‌హాలు కూడా తీసుకునే ఆలోచ‌న చేయ‌రు..ఆ సోయ లేదు అయితే వైసీపీ ని దెబ్బ తీయాలి మ‌న‌కి ఇక్క‌డ ఉనికి లేకుండా  చేయ‌డంలో జ‌గ‌న్ కూడా ఉన్నాడు అనే  అక్క‌సు  కాంగ్రెస్ లో ఉంది.. అందుకే రాహుల్ టీడీపీ వ‌ద్దు ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేయండి అని అన్నారు... స్టేట్ లోనే ఓ కామెడీ చూస్తుంటే, హ‌స్తిన‌లో కూడా మ‌రో కామెడీ సిరీస్ వ‌దిలారురాహుల్..ఆ  కామెంట్ల‌తో ..
 
పైగా ఇప్పుడు కిర‌ణ్ కుమార్ రెడ్డిని రాజ‌కీయంగా ముందు ఉంచి తెలుగుదేశం వైసీపికి చుక్కలు, ఆకాశంలో అనురాధా న‌క్ష‌త్రాలు చూపిస్తార‌ట.. మ‌రి చూడ‌టానికి ప్ర‌జ‌లు ఎలా ఉన్నా తెలియ‌దు కాని అస‌లు  ఆ కాంగ్రెస్ పార్టీలో నాయ‌కులు ఎవ‌రు ఉన్నారు అనేది చెప్పాలి.. మ‌న రాహుల్ గారు ముందు ఇక్క‌డ కేడ‌ర్ నుఏర్పాటు చేసుకోవ‌డంలో స్పీడు పెంచాలి. 
 
125 ఏళ్ల కాంగ్రెస్ కూడా క‌ష్ట‌ప‌డాలి ..లేక‌పోతే జ‌న‌సేనాని త‌న దూకుడుతో చిన్నా చిత‌క లీడ‌ర్ల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకుంటే మిగిలేది ఏమీ ఉండ‌దు... కార్పొరేట‌ర్ స్టేజ్ నాయ‌కులు మండ‌ల లెవ‌ల్ లీడ‌ర్లు.. ఇటు త‌మ్ముడు తెలుగుదేశం అన్న కాంగ్రెస్ అంటే న‌మ్మే ప్ర‌జ‌లు అస‌లు ఎవ‌రూ లేరు కిర‌ణ్ కుమార్ రెడ్డి వ్య‌వ‌హారంలో.. ఇక చిరంజీవిని తీసుకువ‌చ్చినా కాంగ్రెస్ కు కొత్త శోభ వచ్చే అవ‌కాశం లేదు.. పైగా చిరంజీవికి ఆ థాట్ లేదు.. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న నాయ‌కులే న‌మ్మ‌రు..రాహుల్ కాస్త ఆలోచించండి సార్...ఈ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఏమి కావాలో తెలుసుకోండి..ఎవ‌రికి ఓట్లు వెయ్యాలో మాకు తెలుసు అంటున్నారు ప్ర‌జ‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.