జ‌గ్గంపేట‌లో జ‌గ‌న్ అదిపోయే రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-07-28 05:22:37

జ‌గ్గంపేట‌లో జ‌గ‌న్ అదిపోయే రికార్డ్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం నేటితో 222 రోజులోకి అడుగు పెట్టిన సంగ‌తి తెల‌సిందే. జ‌గ‌న్  సొంత జిల్లా క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌నుంచి మొద‌లైన ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని 52 నియోజ‌క‌వ‌ర్గాల‌ను అలాగే కోస్తాలోని 49 నియోజ‌క‌వ‌ర్గాల‌ను పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం వందో నియోజ‌క‌వ‌ర్గం అయిన జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ అడుగు పెట్ట‌గానే మ‌రో మైలురాయిని అధిగ‌మించారు. 
 
ఈ రోజు ఉద‌యం పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్‌ నుంచి మొద‌లైన పాదయాత్ర జగ్గంపేట మండలంలోని కాట్రావుల పల్లి క్రాస్‌, సీతా నగరం శివారు మీదగా జగ్గంపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్  కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు..
 
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు జ‌గ‌న్. ఈ రోజు సాయత్రం జగ్గంపేటలో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌నపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.