న‌వ‌రత్నాల‌ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన జ‌గ‌న్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-11 18:37:38

న‌వ‌రత్నాల‌ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన జ‌గ‌న్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇడుపుల‌పాయ‌లో ప‌డిన మొద‌టిఅడుగు నేటితో 260 రోజుల‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట విశాఖ‌ప‌ట్నంలో జిల్లాలో చేరుకుంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో విశాఖ ఫంక్షణ్ హాల్ చేరుకోగానే 175 మంది వైసీపీ ఇంచార్జ్ ల‌తో, అలాగే 25మంది అసెంబ్లీ ఇంచార్జ్ ల‌తో అలాగే ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌తో మాజీ ఎంపీల‌తో, కో-ఆర్డీనేట‌ర్ల‌తో విస్తృత స్థాయి స‌మావేశం నిర్వహించారు.
 
ఈ స‌మావేశంలో జ‌గ‌న్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు పార్టీ నాయకులకు తెలిపారు. ఎన్నిక‌లు దగ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో స‌ర్వం సిద్దంగా ఉండాల‌ని వారికి పిలుపునిచ్చారు. పాద‌యాత్ర కొనసాగుతుండ‌గాగే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బూత్ ల వారిగి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ పిలునిచ్చారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త ప్ర‌తీరోజు రెండు బూత్ ల‌లో ప‌ర్వ‌టించి గ‌డ‌ప‌గ‌డ‌ప సంద‌ర్శించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. అంతేకాదు సెప్టెంబ‌ర్ 17నుంచి బూత్ ల వారీగా కార్య‌క్ర‌మాల‌ను జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. ఎన్నిక‌లు మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌తీ  ఒక్క‌రు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఇదే ఆఖ‌రి అవ‌కాశం కాబ‌ట్టి అంద‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జ‌గ‌న్ అన్నారు. 
 
ఈ క‌మిటీలో ఓట్లపై దృష్టి సాధించాల‌ని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు ఆదేశించారు. బూత్ ల‌ను సంద‌ర్శించి మొద‌టి విడ‌త‌లో భాగంగా పార్టీ నిర్ధెశించిన 50 బూత్ ల‌ సంద‌ర్శ‌న మొద‌టి నెల‌లోనే పూర్తి చెయ్యాల‌ని జ‌గ‌న్ పిలుపు నిచ్చారు. పార్టీలో ఎక్క‌డ లోపాలు క‌నిపించినా కూడా వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అన్నారు. అలాగే పార్టీపై అల‌క చెందిన వారిని బుజ్జ‌గించే బాధ్యత ఆ నియోజ‌కవ‌ర్గ‌ స‌మ‌న్వయ‌క‌ర్త‌ల‌దే అని అన్నారు. 
 
పార్టీ త‌ర‌పున ప్ర‌క‌టించిన‌ న‌వ‌రత్నాల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరిగింద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. న‌వ‌ర‌త్నాల‌ గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయ్యాల‌ని పిలుపునిచ్చారు. వాటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంత‌మేలు జ‌రుగుతుంది అనే విష‌యాన్ని క్లుప్తంగా వివ‌రించాల‌ని అన్నారు. అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌బోయే ప్ర‌లోభాల‌కు ఎవ్వ‌రు లొంగ‌కుండా చూసుకోవాల‌ని పిలుపునిచ్చారు.
 
ఆ త‌ర్వాత జ‌గ‌న్ న‌వ‌రత్నాల‌ వ‌ల్ల జ‌రిగే మేలును వివ‌రిస్తూ రూపొందించిన పోస్ట‌ర్ ను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడుద‌ల చేశారు. అలాగే ఈ పోస్ట‌ర్ పార్టీ వెబ్ సైట్ లో ఉంటుంద‌ని దీనిని ప్ర‌తి ఒక్క‌రు డౌన్ లోడ్ చేసుకోవాల‌ని జ‌గ‌న్ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.