జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-01 10:32:08

జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం గ‌తకొద్ది కాలంగా రాజకీయ నాయ‌కుల‌తో పాటు సాధార‌ణ వ్య‌క్తులు కూడా రాష్ట్ర స్థాయిలో ధ‌ర్నాలు రాస్తోరోకోలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఉద్య‌మం కాస్త ఏపీలో ఉద్రిక్తం కావండంతో ప‌లు చోట్ల‌ ప్ర‌త్యేక హోదా కోసం త‌మ ప్రాణ‌ల‌ను సైతం లెక్కచేయ‌డంలేదు.
 
ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాకు చెందిన వ్య‌క్తి అలాగే, ప్ర‌కాశం జిల్లాకు చెందిన వ్య‌క్తి హోదా కోసం ప్రాణాల‌ను తీసుకున్నారు. ఇక మర‌ణవార్త రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే హోదా కోసం మ‌రో ప్రాణం బ‌లి అయింది. విశాఖ జిల్లా న‌క్క‌ప‌ల్లిలో త్రినాథ్ అనే వ్య‌క్తి హోదా కోసం ప్రాణత్యాగం చేశాడు. ఇక ఈ విష‌యాన్ని తెలుసుకున్న ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు.
 
ప్ర‌త్యేక హోదా కోసం ఎవ్వ‌రు ప్రాణాలు తీసుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌త్యేక‌హోదా ఏపీ ప్ర‌జ‌ల హ‌క్కు అని దానిని మ‌న‌మంద‌రం బ్ర‌తికుండి సాధించుకోవాల‌ని సూచించారు. త్రినాథ్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభుతి తెలిపారు జ‌గ‌న్ .

షేర్ :