ఎమ్మెల్యే అంటే అర్ధం చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy punch to chandrababu naidu
Updated:  2018-03-29 05:41:13

ఎమ్మెల్యే అంటే అర్ధం చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు సెగ్మెంట్లో పాద‌యాత్ర చేస్తున్నారు... ఆయ‌న పాద‌యాత్ర‌లో భాగంగా పెద‌కూర‌పాడు స‌భ‌లో మాట్లాడారు... ఇక్క‌డ ప్ర‌జ‌లు త‌న‌పై ఎన‌లేని ప్రేమ చూపార‌ని ప్ర‌జ‌ల బాధ‌లు చెప్పుతూ అర్జీలు ఇస్తూ మీకు తోడుగా ఉన్నాము అన్నా అంటూ నా వెంట ఉన్న‌వారి అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు జ‌గ‌న్... బాబు ఇక్క‌డ జిల్లాలో రాజ‌ధాని పెట్టి ఒక్క ఇటుక కూడా వేయ‌లేద‌ని అన్నారు.
 
పులిచింతల ప్రాజెక్ట్ తానే శంకుస్ధాప‌న చేసి తానే పూర్తి చేయ‌డం చూశాం రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో అని అన్నారు జ‌గ‌న్..... కిర‌ణ్ కుమార్ రెడ్డి స‌ర్కారు మిగిలిన 5 శాతం ప‌నులు పూర్తి చేసిగేట్లు ఎత్తారు అని జ‌గ‌న్ తెలియ‌చేశారు.. మ‌ళ్లీ అదే ప్రాజెక్టును పునః ప్రారంభం చేస్తాడు అని బాబు పై ఆయ‌న ఫైర్ అయ్యారు.... పులి చింత‌ల‌లో 45 టీఎంసీల నీరు నిల్వ చేయ‌డానికి చంద్ర‌బాబుకు నాలుగేళ్లు ప‌ట్టింది అని అన్నారు జ‌గ‌న్.
 
ఇక్క‌డ సెగ్మెంట్లో ప్ర‌జ‌లు చెప్పే బాధల గురించి చెప్పారు జ‌గ‌న్ ...  ఇక్క‌డ అవినీతిలో లంచాలు తీసుకుంటా అన్ని దోచేస్తా ఉన్నారు అని  ఆయ‌న విమర్శు చేశారు.....ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో  ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు  చెబుతుంటే ఆశ్చ‌ర్యం వేసింది... ఈ మ‌ధ్య కాలంలో ఓ సినిమా రిలీజ్ అయింది... ఈ మ‌ధ్య రిలీజైన ఎమ్మెల్యే సినిమా తెలిసే ఉంటుంది.. ఆ సినిమా ట్యాగ్ లైన్ మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి..
 
అయితే ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అంటే ఏ లెవ‌ల్లో ఉన్నాడో ఇక్క‌డ అర్ధం ఏమిటో తెలుసా... మాముళ్లు లంచాలు తీసుకునే అబ్బాయి అని ఇక్క‌డ ఎమ్మెల్యేకి ట్యాగ్ లైన్ అని పంచ్ వేశారు జ‌గ‌న్... ఇక్క‌డ అవినీతి దారుణంగా జ‌రుగుతోంది అని అన్నారు జ‌గ‌న్ ... కృష్ణాన‌దిలో ఇసుక‌లో ఏడు రీచ్ లు వేల కొల‌ది లారీలు వెళుతున్నా డ్రిజ్జింగ్ మిష‌న్లతో దోచేస్తున్నారు అని ఆయ‌న విరుచుకుప‌డ్డారు..ఇక్క‌డ ఎమ్మెల్యేల‌కు ఇంత వాటా చిన‌బాబుగారికి ఇంత వాటా అని ఇక్క‌డ జ‌నాలే చెబుతున్నారు అని అన్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.