జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల‌పై జ‌నాలు ఏమంటున్నారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 18:32:21

జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల‌పై జ‌నాలు ఏమంటున్నారు

ప్ర‌తిపక్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర టీడీపీ నాయ‌కుల కంచుకోట కృష్ణా జిల్లాను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. 
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గన్ న‌వ‌ర‌త్నాల‌తో పాటు ఆయా ప్రాంతాల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌కు కొండంత భ‌రోసా ఇస్తూ కీల‌క హామీల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఇక జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల‌పై అధికార నాయ‌కులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ప్ర‌తిప‌క్ష‌నేత‌ ప్ర‌క‌టించిన హామీలు ఎవ‌రు న‌మ్మ‌కూడ‌ద‌ని అవి అమలు కానీ హామీలంటూ టీడీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. 
 
అయితే వారు చెప్పే విష‌యాల‌ను ప్ర‌జ‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలో వ‌చ్చార‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా కానీ ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేద‌ని  ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. రాజ‌ధాని నిర్మాణం పేరు చెప్పి కేంద్రం నుంచి  వేల కోట్ల‌ను విడుద‌ల చేయించుకుని అమ‌రావ‌తిలో ఒక్క బిల్డింగ్ కూడా నిర్మించ‌లేద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.
 
అయితే టీడీపీ నాయ‌కులు  ప్ర‌క‌టించిన హామీల కంటే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీలే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా రాష్ట్రంలో అభివృద్ది జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. మ‌రి కొద్దిరోజుల్లో మ‌ళ్లీ తాము రాజ‌న్న రాజ్యం చూడ‌బోతున్నామ‌ని త‌మ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.