జ‌గ‌న్ సీక్రెట్ ఆప‌రేష‌న్ స్టార్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-20 16:32:08

జ‌గ‌న్ సీక్రెట్ ఆప‌రేష‌న్ స్టార్ట్

వైసీపీ గుర్తుపై గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో వెంట‌నే పార్టీ మారిన నాయ‌కులు ఉన్నారు.. తెలుగుదేశం ఆఫ‌ర్ల‌కు కొద్ది నెల‌ల త‌ర్వాత పార్టీ మారిన నేత‌లు ఉన్నారు.. ముఖ్యంగా వైసీపీ  గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించ‌డం తెలిసిందే... ఇక వీరిని రాజీనామా చేయాలి అని కోరినా, ఎటువంటి స్పందన వీరి నుంచి లేదు..
 
అయితే పార్టీ ఫిరాయించిన సెగ్మెంట్ల‌లో వైసీపీ ఎటువంటి పొలిటిక‌ల్ స్టెప్ అమ‌లు చేయాలో అలాగే అమ‌లు చేస్తోంది. ప్ర‌స్తుతం వైసీపీ త‌ర‌పున ఉన్న నాయ‌కులు. ఎటువంటి పొలిటిక‌ల్ స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళ్లాలి అనేది వారికి తెలిసిందే అదే విధంగా ముందుకు వెళుతున్నారు.
 
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపులు ద్వారా 23 మందిని పార్టీలోకి తీసుకుని, న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అయితే తెలుగుదేశం నాయ‌కులు,  మంత్రులు, ఈ ఫిరాయింపు  నాయ‌కులు అస‌లు రాజీనామాల మాట ఎత్తేస‌రికి వెన‌క్కి వెళ్లిపోతున్నారు.
 
ముఖ్యంగా వైసీపీ త‌ర‌పున గెలిచి పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు రాయ‌ల‌సీమ నుంచి క‌ర్నూలు అలాగే కోస్తా నుంచి  ప్ర‌కాశం జిల్లాల్లో అధికంగా ఫిరాయింపుల ఎఫెక్ట్ పార్టీకి దెబ్బ కొట్టింది.. అందుకే జ‌గ‌న్ ఇక్క‌డ నుంచే పార్టీ పై  ఫోక‌స్ పెట్టారు.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం నాయ‌కులు బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న చోట ఆయ‌న త‌న కేడ‌ర్ ను నిలుపుద‌ల కోసం టీడీపీ ఇస్తున్న ఆఫ‌ర్ల‌ను తిప్పికొడుతున్నారు... ముఖ్యంగా వైసీపీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు కాంట్రాక్టులు ఎర‌వేశారు అనే విమ‌ర్శ అధికార పార్టీ పై ఉంది.
 
అదే ఇప్పుడు కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో వేయాలి అని అధికార పార్టీ భావిస్తోంది.. ఈ 10 నెల‌ల కాలంలో పార్టీ పై ఎటువంటి మైన‌స్ ప‌డ‌కుండా చూసుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు.. అయితే ఇటు నంద్యాల ఓట‌మిపై కూడా వైసీపీ పోస్టుమార్టం చేసుకుంది.. ఎటువంటి మైన‌స్ లు పార్టీలో ఉన్నాయి దీనిప‌రిణామాలు పార్టీపై ఏ విధంగా ఎన్నిక‌ల్లో చూపించాయి అనేది తెలుసుకుంది.. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా నంద్యాల రిజ‌ల్ట్ ఎఫెక్ట్ చూపించింది అనేది తెలిసిందే.
 
అందుకే క‌ర్నూలు ప్ర‌కాశం జిల్లాలో జ‌గ‌న్ ఓ సీక్రెట్ మిష‌న్ స్టార్ట్ చేశారు అని తెలుస్తోంది... ఫిరాయింపు సెగ్మెంట్ల‌లో ఎటువంటి రిజ‌ల్ట్ ప్ర‌జలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇవ్వ‌నున్నారు అనేది తెలుసుకోనున్నారు... రాజ‌కీయంగా ఇది హీట్ పుట్టిస్తున్న అంశం, అయినా తెలుగుదేశం పై  కొంత‌మిశ్ర‌మ స్పందన వ‌స్తోంది ఈ సెగ్మెంట్ల‌లో.. ఇప్ప‌టికే ప్ర‌కాశంలో ఓ ఫిరాయింపు ఎమ్మెల్యే పై ప్ర‌జ‌లు కూడా కోడిగుడ్ల‌తో దాడి చేసింది తెలిసిందే ఇదే వ్య‌తిరేక‌త ఉంటే డిపాజిట్లు రావ‌డం కూడా క‌ష్ట‌మే..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.