జ‌గ‌న్ ఆరోగ్య ర‌హ‌స్యం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-24 11:45:28

జ‌గ‌న్ ఆరోగ్య ర‌హ‌స్యం ఇదే

నంవంబ‌ర్ 6, 2017 క‌డ‌ప‌జిల్లా పులివెందుల నియోజక‌వ‌ర్గం ఇడుపులపాయ గ్రామంలో ప‌డిన మొద‌టి అడుగు ఇప్పుడు వేల, ల‌క్ష‌ల అడుగులై నేడు 3000 వేల కిలో మీట‌ర్ల‌తో పూర్తి చేసుకోనున్నారు ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ పాద‌యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టినుంచి నేటి వ‌ర‌కు ఎలాంటి మార్పులు చేర్పులు జ‌ర‌గ‌లేదు.
 
రాత్రి పూటా కార్య‌క‌ర్త‌ల‌తో ఎంత‌సేపు మ‌ట్లాడినా కూడా ఉద‌యం 4.30ల‌కే నిద్ర‌లేస్తారు. ఆత‌ర్వాత గంట‌సేపు వ్య‌య‌మం చేసిత త‌ర్వాత పాద‌యాత్ర‌కు రెడీ అవుతారు. ఆ త‌ర్వాత ముఖ్యుల‌తో ఫోన్ సంభాష‌ణ,సంభాష‌ణ ఆ త‌ర్వాత రోజు సాగే పాద‌యాత్ర మార్గాన్ని తెలుసుకుని ఎన్ని గంట‌కు ఎక్క‌డ ఉండాలో అడిగి తెలుసుకుని పాద‌యాత్ర చేయ‌డంలో జ‌గ‌న్ కు సాటి ఎవ్వ‌రు రారు. 
 
ఆయ‌న పాద‌యాత్ర స్టార్ట్ చేసేముందు కేవ‌లం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటారు. ఇక మ‌ధ్యాహ్నం కేవ‌లం కొన్ని పండ్లు క‌ప్పు, పెరుగు మాత్ర‌మే తీసుకుంటారు. అలాగే రాత్రి స‌మ‌యంలో కేవ‌లం రెండు పుల్కాలు  ప‌ప్పు లేక  మ‌రో కూర‌తో ముగిస్తారు. తిరిగి య‌ధావిదిగా తెల్ల‌వారు జామునే లేసి రోజు తెల్ల‌చొక్కా క్రీమ్ ఫ్యాంట్, బూట్లూ వేసుకుని పాద‌యాత్ర చేస్తారు. ఇవే ఆయ‌న‌కు ఆరోగ్యం అని అంద‌రూ భావిస్తుంటారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.