అసలు సిసలైన డిమాండ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 06:37:04

అసలు సిసలైన డిమాండ్

వైయ‌స్సార్ కాంగ్రెస్  పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం  త‌మ పోరాటం ఆగ‌ద‌ని, మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 6 వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని, మార్చి 1న రాష్ట్రంలో అన్ని క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ధర్నాలు ఉంటాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ గుర్తు చేశారు.
 
అదే విధంగా మార్చి 3న పార్టీ ఎంపీల‌ను, ఎమ్మెల్యేల‌ను ఢిల్లీ పంపిస్తా... 5న వీరంతా అక్క‌డ ధ‌ర్నా చేస్తారు....ఆ తర్వాత మార్చి 5 నుండి ఏప్రిల్  6 దాకా త‌మ పార్టీ ఎంపీలు హోదా సాధించేందుకు పార్ల‌మెంట్ లో వీరోచిత పోరాటం చేస్తారు...అయినా కూడా మంచి జ‌ర‌గ‌క‌పోతే ఏప్రిల్ ఆరున రాజీనామాలు చేసి వారి మొహ‌న కొట్టి తిరిగి ఏపీకి వ‌స్తార‌ని జ‌గన్ అన్నారు. 
 
అయ్యా చంద్ర‌బాబు... మీ ప్ర‌త్యేక ప్యాకేజి ప‌క్క‌కు పెట్టు....రూపాయి, అర్ధ‌రూపాయి కోసం మీరు చేస్తున్న పోరాటం ప‌క్క‌కు పెట్టి ముందుకు రా....వైసీపీ ఎంపీల‌తో పాటు టీడీపీ ఎంపీలు కూడా మొత్తం 25 మంది చేత రాజీనామా చేయిద్దాం...అప్పుడు హోదా ఇవ్వ‌కుండా  ఎక్క‌డికి పోతారో చూద్దాం....అంటూ వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న డిమాండ్  చేశారు. మ‌రి జ‌గ‌న్ డిమాండ్ కు టీడీపీ ఏం స‌మాధానం ఇస్తుందో....వేచి చూడాలి.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.