బాబును విమ‌ర్శిస్తూ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 15:39:22

బాబును విమ‌ర్శిస్తూ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌లపెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కంచుకోట అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గన్ వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రి ముఖంలో చిరున‌వ్వు చూస్తాన‌ని కొండంత భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
 
అయితే ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ త‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
చంద్ర‌బాబు నాయుడుగారు ఏంటి మీ అమానుషం... వారేం త‌ప్పు చేశారు... అధికారం ఉంది క‌దా అని క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తారా! మ‌హిళా పార్ల‌మెంట్ ను విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించామ‌ని గొప్ప‌లు చెప్పుకున్న‌మీరు అదే విజ‌య‌వాడ‌లో అక్క‌చెల్లెమ్మల‌ ప‌ట్ల ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు సిగ్గుచేటు కాదా! వారిప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం అత్యంత హేయం, దారుణం కాదా అని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారు. 
 
ఈ ప్ర‌భుత్వం స‌రిగ్గా వేత‌నాలు ఇవ్వ‌కున్నా5-6 నెల‌లుగా స‌రుకుల బిల్లులు చెల్లించ‌క‌పోయినా 85వేల మంది అప్పో సొప్పో చేసి పిల్ల‌ల‌కు భోజ‌నం వండి పెడుతున్నారు. అయినా స‌రే దేశంలో ఎక్క‌డా లేని విధంగా  భోజ‌నం వండే ప‌నినుంచి వారిని తొల‌గించి ప్రైవేట్ ఏజెన్సీల‌కు అప్ప‌గించ‌డానికి ఈ స‌ర్కార్ త‌హ‌త‌హ‌లాడుతోంది. దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాము. 
 
వైసీపీ అధికారంలోకి రాగానే మ‌ధ్యాహ్నం భోజ‌నం వండే ప‌నిని అక్క‌చెల్లెమ్మ‌ల‌కే అప్ప‌గిస్తాము. అంతేకాదు వారికి గౌర‌వ‌వేతనం పెంచి అండ‌గా ఉండ‌టంతో పాటు పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందేలా భోజ‌న ధ‌ర‌లు పెంచి బిల్లుల‌ను స‌కాలంలో చెల్లిస్తామ‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.