జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan padayatra undi constituency
Updated:  2018-05-25 06:15:45

జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నా. ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్, తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా వైసీపీ నాయ‌కులు ఆకివీడు లో భారీ భ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ భ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ, మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఈ నియోజ‌కవ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు మంచినీరు కూడా అందించ‌లేక పోతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 2014 లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డాని, ప్ర‌తీ ఒక్క‌రికి మూడు సెంట్ల భూమితో ఇల్లు క‌ట్టిస్తామ‌ని చెప్పి ఇంత వ‌ర‌కూ ఈ నియోజ‌కవ‌ర్గంలో ఒక్క ఇల్లు కూడా క‌ట్టించ‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
అలాగే త‌మ పార్టీ, రైతుల పార్టీ అని ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు రైతుల‌కు ఒక పంట‌కు కూడా నీళ్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో టీడీపీ ప్ర‌భుత్వం ఉందని మండిప‌డ్డారు. అదే వైయ‌స్సార్ హ‌యాంలో ప్ర‌తీ ఒక్క రైతుని త‌న గుండెల్లో పెట్టుకుని చూసుకున్నార‌ని, రైతు క‌ష్ట‌మే త‌న క‌ష్ట‌మ‌ని భావించి రైతుల ప‌క్షాన‌ నిల‌బ‌డ్డార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. 
 
ఆకివీడులో ఎక్కువ శాతం మంది చేప‌లు, రొయ్య‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తార‌ని, ఒక‌ప్పుడు వాటి ధ‌ర కేజీ రూ. 400 వంద‌లు ఉండేద‌ని, కానీ చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక వాటి ధ‌ర రూ. 200 వంద‌ల‌కు త‌గ్గించార‌ని ఆరోపించారు, అయితే వాటి దానా మాత్రం 200 రూపాయ‌లు అక్ర‌మంగా గుంజుకుంటున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. దీంతో పాటు టీడీపీ నాయ‌కులు కరెంట్ బిల్ విప‌రీతంగా పెంచార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.