వియ్యంకుల‌ను దుమ్ము దులిపిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-17 05:55:09

వియ్యంకుల‌ను దుమ్ము దులిపిన జ‌గ‌న్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న అవినీతి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మంత్రి గంటా శ్రీనివాస‌రావును నియ‌మించుకున్నార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ నాయ‌కులు భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్ల‌డుతూ, విశాఖ జిల్లాలో దొంగ‌లు దొంగ‌లు క‌లిసి ఒక ఊరుని దోచుకున్న‌ట్లుగా ఇద్ద‌రు అధికార పార్టీకి చెందిన నాయ‌కులు విశాఖ జిల్లా భూముల‌ను దోచుకుంటున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. 
 
టీడీపీ హ‌యాంలో ఈ జిల్లాలో ఎక్కడా ప్ర‌భుత్వ భూములు క‌నిపించ కున్నాయ‌ని, అలాగే అసైన్ట్ భూములు క‌నిపించ‌కున్నాయ‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో భీమిలీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎటువంటి అభివృద్ది జ‌రుగ‌లేద‌ని జ‌గ‌న్ అన్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు ముఖ్య‌మంత్రి కుమారుడితో కుమ్మ‌క్కు అయి రికార్డుల‌ను తారుమారు చేసి విచ్చ‌ల‌విడిగా దోచుకుంటున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు జ‌గ‌న్. 
 
ప్ర‌భుత్వ భూములకు అక్ర‌మంగా ప‌ట్టాల‌ను త‌యారు చేయించుకుని బ్యాంకుల్లో రుణాలను తీసుకుంటున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు వియ్యంకుడు మంత్రి నారాయ‌ణ... ఈయన‌ విద్యా స్థంస్థ‌ల్లో ఫీజులు బాదుడే బాదుడ‌ని జ‌న‌న్ తెలిపారు.
 
నారాయ‌ణ కాలేజీల‌కు ఫీజు పెంచుకునేందుకు మంత్రి గంటా ప‌ర్మీష‌న్ ఇస్తున్నార‌ని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో సుమారు 50వేల‌మంది కార్మికుల‌కుగాను సుమారు 30 వేల మంది కార్మికులు రోడ్డున ప‌డ్డారని జ‌గ‌న్ ఆరోపించారు. దివంగ‌త‌నేత ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ని ఈ జిల్లా ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుని చూశార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.