త‌ప్పా.. ఒప్పా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 02:53:03

త‌ప్పా.. ఒప్పా....

మీడియాపై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని అనుకుంటున్నారా...నిజ‌మే జ‌గ‌న్ మీడియాను విమ‌ర్శించ‌డంలో  ఏమాత్రం త‌ప్పులేద‌నే చెప్పాలి. దీంతో పాటు  జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్దించుకోవ‌డంపై కూడా  ఆలోచించుకోవాల్సిందే. 
 
ఇక విష‌యంలోకి వ‌స్తే.... ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఓ తెలుగు దిన‌ప‌త్రిక ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మీడియాను త‌ప్పుబ‌ట్టారు. గ‌తంలో దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖర్ రెడ్డి  విప‌క్ష‌నేత‌గా కొనసాగుతున్న‌పుడు 90 మంది ఎమ్మెల్యేలు ఆయ‌న వెంటే న‌డిచారు..కాని ఇప్పుడు మీ పార్టీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు... ఇందులో లోపం  ఎక్క‌డ ఉంద‌ని అనుకుంటున్నారంటూ  స‌ద‌రు ప‌త్రిక జ‌గ‌న్ ను ప్ర‌శ్నించింది. 
 
అందుకు జ‌గ‌న్ స‌మాధాన‌మిస్తూ... లోపం మీడియాలో ఉంద‌ని ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పేశారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్ధ‌లో మీడియా  నాలుగో స్తంభం....ఫిరాయింపుల్ని త‌ప్పుపట్టాల్సిందిపోయి.. వ‌త్తాసు ప‌లుకుతున్నాయంటూ జ‌గ‌న్ విమ‌ర్శించారు. మ‌రోవైపు  ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుండి 40 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్లు చేసి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంది టీడీపీ అని మండిప‌డ్డారు. గ‌తంలో ఫిరాయింపుల చ‌ట్టం లేద‌ని, ఇప్పుడు ఉన్నా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. 
 
నిజ‌మే!! ఫిరాయింపుల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం కార‌ణంగానే పార్టీ మారుతున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే విష‌యాన్ని ప్ర‌సారం చేయాల్సిన మీడియా జ‌గ‌న్ కు షాక్ అంటూ హెడ్డింగ్ లు పెట్టి మ‌రీ రేటింగ్ లు పెంచుకుంటున్నాయి.  నిజంగానే జ‌ర్న‌లిజం విలువ‌లను తుంగ‌లో తొక్కుతున్నారు. మ‌రి రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఇలాంటి  ఫిరాయింపు రాజ‌కీయాల‌నే  కొన‌సాగించాల్సి వ‌స్తే.....అప్పుడు ఇదే  మీడియా మూడో క‌న్ను తెరుస్తుందేమో...!! అందుకే  జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకోవ‌డంపై కూడా ఆలోచించుకోవాల్సిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.