చంద్ర‌బాబుపై ఊపందుకున్న ఐదు పెళ్లిళ్ల ప్ర‌చారం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara chandrababu naidu
Updated:  2018-08-28 15:59:23

చంద్ర‌బాబుపై ఊపందుకున్న ఐదు పెళ్లిళ్ల ప్ర‌చారం

సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల నేత‌ల‌కు స‌ర్వే ఫివ‌ర్ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ నుంచి టికెట్ వ‌స్తుందా..? నేత‌ల ప‌నితీరు ఎలా ఉంది..? ప‌్ర‌త్యేక‌హోదా ఇస్తామంటూ గెలుస్తామా .? ప‌్ర‌భుత్వ ప‌నితీరు గురించి ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది. అధికారం మ‌న‌చేతిలో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌నదే గెలుపా..? ఇలాంటి అనేక ఇత్యాది అంశాల‌పై తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు ప‌బ్లిక్ పల్స్ తెలుసుకుంటున్నారు.
 
ఈ ప‌ల్స్ తోనే వ‌చ్చే ఎన్నిల‌క‌ల్లో సీటు, గెలుపుపై ధీమాగా ఉన్నారు. మ‌రి ఏఏ పార్టీలు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునేందుకు ఏం చేస్తున్నాయో తెలుసుకుందాం.
 
ముంద‌స్తు ఎన్నిక‌ల్లో 100సీట్లు మ‌న‌వే నంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నేత‌ల‌కు నూరి పోస్తున్నారు. అదే జోరును కొన‌సాగిస్తూ కొంగ‌ర‌కలాన్ లో ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌కు భారీ ఎత్తున జ‌న‌సమీక‌ర‌ణ చేయాలంటూ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌కు హుకుం జారీ చేశారు. అధినేత ఆదేశాల‌తో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌ను ముంద‌స్తు ఎన్నిక‌ల్లో త‌మ‌ గెలుపుగా భావిస్తూ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అందుకు కార్య‌క‌ర్త‌ల్ని,ప్ర‌జ‌ల్ని త‌మ‌వైపుకు తిప్పుకునేలా ప‌బ్లిసిటీస్టంట్ తో హ‌డావిడి చేస్తున్నారు.  
 
కాంగ్రెస్ ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మ‌న్నుతిన్న‌పాములా కేసీఆర్ చేస్తున్న హ‌డావిడిని నిశితంగా గ‌మ‌నిస్తోంది. అధినేత రాహుల్ గాంధి సూచ‌న‌ల‌తో ఎన్నిక‌లకు సిద్ధ‌మైన హ‌స్తం నేత‌లు గెలుపు త‌మ‌దేనంటూ త్రిశంకు స్వ‌ర్గంలో విహ‌రిస్తున్నారు. చ‌డీచ‌ప్పుడు లేకుండా స‌ర్వేలు, సోష‌ల్ మీడియా, టీఆర్ఎస్ పార్టీ వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌డుతుంది. ఇక‌ వారిలో కొంతమంది ఆశావాహులు ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌లో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
 
ఈ నేప‌థ్యంలో ఐదుపెళ్లిళ్లు చేసుకున్న చంద్ర‌బాబుతో పొత్తుపెట్టుకునేందుకు రాహుల్ గాంధీ సిద్ధ‌మైన పార్టీ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌తీ సార్వ‌త్రిక‌కు ఒంట‌రిగా పోటీ చేయ‌కుండా ఏదో ఒక‌పార్టీతో పొత్తుపెట్టుకొని..ఆ త‌రువాత స‌హ‌చ‌ర మిత్రుల్ని గాలివ‌దిలేస్తార‌ని చంద్ర‌బాబుపై నెగిటీవ్ ప్ర‌చారం జ‌రుగుతుంది.  
 
చచ్చిన పామును మ‌ళ్లీ  మ‌ళ్లీ చంప‌కండ‌నే సామ‌తెను గుర్తు చేస్తుంది ఏపీ టీడీపీ. 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన - బీజేపీ-టీడీపీలు కలిసి ప్ర‌చారం చేశాయి. ఆ ప్ర‌చారంతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నేత‌లు రాష్ట్రాన్నిఅడ్డ‌గోలుగా దోచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌బ్జాలు, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌లో వైఫ‌ల్యం, హ‌త్య‌లు, దోపిడీలు, దుమ్మీల‌తో రాష్ట్రాన్నిబ్ర‌ష్టుప‌ట్టించారు.
 
దీంతో చంద్ర‌బాబు పాల‌న‌పై విసిగి వేసారిన ప్ర‌జ‌లు కొత్త‌నాయ‌క‌త్వంవైపు మొగ్గుచూపుతున్నారు. దీన్ని అదునుగా భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిపీఠం అధీష్టించాల‌ని ఉవ్విళ్లురుతున్నారు. ఓవైపు పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తూ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో టీడీపీ నేత‌ల్ని త‌న‌వైపుకు తిప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ కీల‌క నేత‌లు వైసీపీ లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఐదు పెళ్లిళ్లు చేసుకున్న చంద్ర‌బాబు మ‌నకొద్దంటూ జ‌గ‌న్ కొత్త‌ప‌లుకులు ప‌లుకుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.