అవిశ్వాస తీర్మానంపై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-15 15:52:43

అవిశ్వాస తీర్మానంపై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

వైసీపీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది..  ఈ నెల 21 న కేంద్రం పై ప్ర‌వేశ పెడ‌తామ‌ని చెప్పిన అవిశ్వాస తీర్మానాన్ని   రేపు ప్ర‌వేశ‌పెట్ట‌డానికి సిద్దం అయింది వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యంగా వైసీపీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం, పార్ల‌మెంట్ స‌మావేశాలు త్వ‌ర‌గా ముగియనున్న సంద‌ర్బంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది అని చెబుతున్నారు పార్టీ నాయ‌కులు.
 
అయితే కీల‌క ఆర్దిక బిల్లులు కూడా పార్ల‌మెంట్లో నిర‌స‌నల మ‌ధ్య ఆమోదించ‌ప‌డ్డాయి.. దీంతో స‌మావేశాల‌ను కేంద్రం త్వ‌రిత‌గ‌తినే ముగించ‌నుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా నివ‌ర‌ధిక వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న సంద‌ర్బంగా వైసీపీ ఈ నిర్ణ‌యం తీసుకుంది అని అంటున్నారు పార్టీ నాయ‌కులు.
 
అవిశ్వాసం పై జాతీయ ప్రాంతీయ పార్టీల‌కు వైసీపీ  లేఖ‌లు రాసింది.. త‌మ‌తో క‌లిసి రావాలి అని తెలుగుదేశం ఎంపీల‌కు కూడా కోరుతోంది వైసీపీ. ఇక తృణ‌ముల్- శివ‌సేన -టీఆర్ ఎస్ పార్టీల మ‌ద్ద‌తు అలాగే వామ‌ప‌క్ష పార్టీల మ‌ద్ద‌తు కోరుతున్నాము అని తెలియ‌చేశారు వైసీపీ నాయ‌కులు.
 
ఇప్ప‌టికే వైసీపీ ఎంపీల‌తో చ‌ర్చించారు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక‌ వాయిదా ప‌డిన రోజునే వైసీపీ ఎంపీల రాజీనామాలు చేయ‌నున్నారు అని తెలుస్తోంది. అలాగే ఎంపీ వైవి సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెట్ట‌నున్నారు.. స‌భ‌లో  10 శాతం మంది స‌భ్యుల మద్ద‌తు అవిశ్వాసానికి కావాలి.. అంటే  55 మంది స‌భ‌లో మ‌ద్దతు ఇవ్వాలి.. అందుకే వైసీపీ ఈ లేఖ‌లు రాసి మిగిలిన పార్టీల మ‌ద్ద‌తు తీసుకుంటోంది. మొత్తానికి రేపు ఉద‌యం అవిశ్వాస తీర్మానానికి వైసీపీ రెడీ అవుతోంది.కేంద్రం పై పోరాటం దిశ‌గా ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది అని అంటున్నారు మేధావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.