జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan amaravathi
Updated:  2018-05-21 02:51:08

జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌ధాని విష‌యంలో ఎటువంటి మాట‌లు మాట్లాడినా తెలుగుదేశం కంగారు ప‌డుతూనే ఉంటోంది... ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది... ప్ర‌జ‌లు అత్య‌ధికంగా జ‌గ‌న్ వెంట న‌డిచారు...అయితే వైయ‌స్ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌ను తెలుగుదేశం తిప్పికొట్ట‌లేక‌పోతోంది...
 
ముఖ్యంగా జ‌గ‌న్ పై ఓ బ్లండ‌ర్ వ్యాఖ్య‌లు చేయ‌డం తెలుగుదేశం అలవాటు చేసుకుంది.. అగ్రిగోల్డ్ అంశం రాజ‌ధాని భూములు, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్, రాజ‌ధాని భూములు, తెలుగుదేశం నేత‌లు ఎలా తీసుకున్నారు, స‌ర్కారు రైతుల‌కు ఎటువంటి న్యాయం చేసింది అని ప్ర‌తీ దానిపై జ‌గ‌న్ గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ స్పీచుల‌తో స‌భ‌ల‌లో అద‌ర‌గొట్టారు... స‌ర్కారును ప్ర‌శ్నించారు.. 
 
ఇక చంద్ర‌బాబు స‌ర్కారు ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో తీసుకువ‌చ్చిన మంచి ప‌థ‌కాలు తెలియ‌చేయండి అని ప్ర‌శ్నిస్తున్నారు జ‌గ‌న్ ..ఇక ఇటువంటి కామెంట్ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేని తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు జ‌గ‌న్ పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు కేసులు అంటూ అదే పాత రేడియో మాట‌లు మాట్లాడుతున్నారు..  
 
జ‌గ‌న్ రైతుల‌ను బ‌య‌పెడుతున్నాడు, జ‌గ‌న్ చెప్పే మాట‌లు రైతులు ఎలా అర్దం చేసుకోవాలి, జ‌గ‌న్ వ‌స్తే ఇక్క‌డ రాజ‌ధాని ప్లేస్ మారుస్తారు అని రైతులు భ‌య‌ప‌డుతున్నారు అని తెలుగుదేశం కొత్త విధానం అందుకుంది.. అయితే స‌ద‌రు మంత్రులు ఆలొచించాల్సింది ఒక‌టి ఉంది... కొంద‌రికి ఉప‌యోగం కోసం చంద్ర‌బాబు ఇక్క‌డ రాజ‌ధాని పెట్టినా తాను అధికారంలోకి వ‌స్తే ఇక్క‌డ రాజ‌ధాని మార్చ‌ను ఇక్క‌డే ఉంటుంది అని తెలియ‌చేశారు...
 
అయితే జ‌గ‌న్ చెప్పినా తెలుగుదేశం నాయ‌కులు, అదే ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో కొత్త భ‌యాన్ని తీసుకువ‌స్తున్నారు... ముందు బాబు అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ చేయాలి, దాని మీద ఫోక‌స్ చేయాలి..అది జ‌గ‌న్ చేస్తారు అని అంటున్నారు నాయ‌కులు ప్ర‌జ‌లు...మొత్తానికి తెలుగుదేశం ఎన్ని ఆలోచ‌న‌లు చేస్తున్నా జ‌గ‌న్ ను ఎదుర్కోలేరు అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు..
 
జ‌గ‌న్ ఆ నాడు ఎటువంటి ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి పై చేశారో అది తెలుగుదేశానికి సంచ‌ల‌న‌మే ఆ మాట మీదే జ‌గ‌న్ ఉన్నారు అమ‌రావ‌తే ఏపీ రాజ‌ధాని అని వైసీపీనాయ‌కులు మ‌రోసారి తెలియ‌చేస్తున్నారు.. ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్డ్ చేయ‌క్క‌ర్లేద‌ని మీ డైవ‌ర్టులు యూట‌ర్నులు నాలుగేళ్లుగా చూస్తున్నామ‌ని  ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.