నేడు జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 13:29:23

నేడు జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

గుంటూరులో వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నిర్విరామంగా కొన‌సాగుతోంది.. ముఖ్యంగా పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ కు తెలుగుదేశం కంచుకోట అయిన గుంటూరులో కూడా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు...మ‌రీ ముఖ్యంగా సీమ జిల్లాలే జ‌గ‌న్ కు జనాక‌ర్ష‌న క‌లిగి ఉంటాయి అని అనుకున్న తెలుగుదుదేశానికి ఇది మింగుడు ప‌డ‌ని అంశ‌మే.
 
ఇక సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ముప్పాళ్ళలో వైసీపీ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్ష నేత జగన్‌ పార్టీ ఎంపీలతో చర్చించనున్నారని వైసీపీ నాయ‌కులు తెలియచేశారు...ఏప్రిల్‌ ఆరో తేదీన వైసీపీ ఎంపీలతో రాజీనామా చేసే అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.
 
ఇప్ప‌టికే ఇక్క‌డ భేటీకి నేత‌లు అంద‌రూ స‌మాయ‌త్తం అయ్యారు...ముప్పాళ్ళలో  జ‌రుగ‌నున్న‌ పార్లమెంటరీ సమావేశానికి పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. రాజీనామాల విష‌యంలో ఎటువంటి కీల‌క ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ పార్టీ త‌ర‌పున చేయ‌నున్నారో తెలియ‌నుంది.. ఇక ముందుగానే పార్ల‌మెంట్ ను వాయిదావేసే ఆలోచ‌న‌లో బీజేపీ ఉంది... దీంతో ముందుగానే రాజీనామాల అస్త్రం ప్ర‌యోగించే అవ‌కాశం ఉంది అని కూడా నేత‌లు తెలియ‌చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.