హ‌రికృష్ణ‌కు నివాళులు అర్పించిన త‌ర్వాత‌ సంచ‌ల‌న హామీ- జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-30 10:59:36

హ‌రికృష్ణ‌కు నివాళులు అర్పించిన త‌ర్వాత‌ సంచ‌ల‌న హామీ- జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం టీడీపీకి కంచుకోట‌గా మారిన విశాఖప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది.
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్‌.
 
అందులో భాగంగానే వైసీపీ నాయ‌కులు అన‌కాప‌ల్లిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఈ ప్ర‌సంగంలో ముందుగా జ‌గ‌న్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే హ‌రికృష్ణ‌కు నివాళులు అర్పించారు, హ‌రికృష్ణ మ‌న మ‌ధ్య‌లేక పోవ‌డం దుర‌దృష్ట‌కరం అని ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌లుగాల‌ని అన్నారు. ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికార బ‌లంతో చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌క్షంలో ఎండ‌గ‌ట్టారు. 
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేద ప్ర‌జ‌ల ప్లాట్లను కూడా వ‌ద‌ల‌కుండా దోచుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబట్టి ప్ర‌జ‌లకు ప్లాట్లు ఇస్తున్నార‌ని అయితే వారు ఇచ్చిన ప్లాట్ల‌ను తీసుకోవాల‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌లు తీసుకున్న ప్లాట్ల‌కు క‌ట్టే అద్దె మొత్తాన్ని తాను రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు.
 
గ్రేట‌ర్ విశాఖ‌లో అన‌కాప‌ల్లిని క‌లిసిన త‌ర్వాత అన‌కాప‌ల్లిలో ఏమైనా అభివృద్ది జ‌రిగిందా అంటే కరెంట్ చార్జీలు ఇంటి, ప‌న్నులు పెరిగాయ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అందుకే తాను వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అన‌కాప‌ల్లి స‌ప‌రేట్ జిల్లా చేస్తాన‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.